Telugu Global
Cinema & Entertainment

18 Pages: ఎండింగ్ గుర్తుండిపోతుంది

Nikhil 18 Pages Movie: నిఖిల్ హీరోగా నటించిన సినిమా ఇది. శుక్రవారం రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో క్లయిమాక్స్ అందరికీ గుర్తుండిపోతుందని అంటున్నాడు దర్శకుడు సూర్యప్రతాప్.

18 Pages: ఎండింగ్ గుర్తుండిపోతుంది
X

నిఖిల్ హీరోగా నటించిన సినిమా 18-పేజెస్. ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది ఈ సినిమా. ఈ మూవీ గురించి ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడాడు దర్శకుడు సూర్యప్రతాప్. ఈ సినిమాలో కథే హీరో అంటున్నాడు ఈ దర్శకుడు. మరీ ముఖ్యంగా క్లయిమాక్స్ సినిమాకు ప్రాణం అని చెబుతున్నాడు.

"ఇది ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మాత్రమే కాదు. దీనిలో బోలెడన్ని ఎమోషన్స్ ఉన్నాయి, సినిమా చూస్తున్న రెండు గంటలు మాత్రం ఆడియన్స్ వాళ్ళని వాళ్లే క్వశ్చన్ చేసుకుంటారు. ఈ సినిమాలో ఫీలింగ్ ఉంటుంది, కనెక్టవిటీ ఉంటుంది, ఫన్ ఉంటుంది. ఏమి జరుగుతుందా అనే చిన్న థ్రిల్లింగ్ ఉంటుంది. సినిమా ఎండింగ్ మాత్రం అందరికీ గుర్తుండిపోతుంది."

కార్తికేయ-2 సక్సెస్ తర్వాత 18-పేజెస్ సినిమా కథకు చాలా మార్పులు చేసినట్టు వార్తలు వచ్చాయి. వాటిని ఖండించాడు సూర్యప్రతాప్. నిఖిల్ పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ తమ కథలో మార్పులు చేయలేదని, నిఖిల్ ఇమేజ్ ను పెంచేలా చిన్న చిన్న చేర్పులు మాత్రం చేశామన్నాడు.

అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందించాడు. జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కింది 18-పేజెస్ సినిమా.




First Published:  21 Dec 2022 5:30 AM GMT
Next Story