Telugu Global
Cinema & Entertainment

Surya Kiran | దర్శకుడు సూర్యకిరణ్ మృతి

Director Surya Kiran - సత్యం సినిమాను డైరక్ట్ చేసిన సూర్యకిరణ్ కన్నుమూశారు. అతడు బాలనటుడిగా 200కు పైగా సినిమాలు చేశారు.

Surya Kiran | దర్శకుడు సూర్యకిరణ్ మృతి
X

టాలీవుడ్ లో విషాధం చోటుచేసుకుంది. దర్శకుడు సూర్యకిరణ్ ఈరోజు కన్నుమూశారు. తెలుగులో ఆయన సుమంత్ హీరోగా సత్యం అనే సినిమా తీశారు. అలా దర్శకుడిగా తీసిన తొలి సినిమాతోనే ఆయన చాలా పాపులర్ అయ్యారు. తీవ్రమైన అనారోగ్యంతో కొన్నాళ్లుగా బాధపడుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు సూర్యకిరణ్.

కేరళలో పుట్టి, ఏపీలో పెరిగిన సూర్యకిరణ్, చిన్నప్పట్నుంచి సినిమాలే లోకంగా బతికారు. బాలనటుడిగా 200కు పైగా సినిమాల్లో నటించారు. పెద్దయిన తర్వాత సహాయ నటుడిగా చేశారు. అదే క్రమంలో దర్శకుడిగా మారి సత్యం సినిమా తీశారు. ఆ సినిమా పెద్ద హిట్టవ్వడంతో, తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నారు సూర్యకిరణ్.

అయితే ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో కొన్ని సినిమాలొచ్చినప్పటికీ ఏవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. అదే టైమ్ లో ఆమె నటి కల్యాణిని ప్రేమవివాహం చేసుకున్నారు. అయితే ఆ బంధం కూడా ఎక్కువకాలం నిలవలేదు. సూర్యకిరణ్-కల్యాణి విడిపోయారు.

దీనికితోడు నిర్మాతగా సూర్యకిరణ్ తీసిన ఓ సినిమా భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. ఉన్న ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా వరుస దెబ్బలతో సూర్యకిరణ్ కుంగిపోయారు. కొంతకాలంగా ఆయన జాండీస్ తో బాధపడుతున్నారట. దానికి చికిత్స పొందుతూనే, తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన మృతిచెందినట్టు తెలుస్తోంది.

First Published:  11 March 2024 5:13 PM GMT
Next Story