Telugu Global
Cinema & Entertainment

Superstar Krishna: సూపర్ స్టార్ మృతిపై ఆర్జీవీ విభిన్న ట్వీట్

'కృష్ణ మృతి చెందారని ఎవరూ బాధ పడనవసరం లేదు. ఆయన స్వర్గంలో విజయనిర్మలను కలుసుకొని ఉంటారు. వారిద్దరూ కలిసి పాటలు పాడుకుంటూ నృత్యం చేస్తూ ఉంటారు.' అంటూ వర్మ ట్వీట్ చేశాడు. మోసగాళ్లకు మోసగాడు చిత్రంలోని ఓ పాటను కూడా ఆయన ట్వీట్‌కు జత చేశాడు.

Superstar Krishna: సూపర్ స్టార్ మృతిపై ఆర్జీవీ విభిన్న ట్వీట్
X

సందర్భం ఏదైనా తనదైన శైలిలో ట్వీట్లు చేస్తూ అందరినీ ఆకర్షించడం దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కొత్తమీ కాదు. ఆయన చేసిన ట్వీట్లు.. పెట్టే పోస్టులు అప్పుడప్పుడూ తీవ్ర వివాదం అవుతుంటాయి. సమాజంలో దుమారం రేపుతుంటాయి. ఆయనకు కావాల్సింది కూడా అదే. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ కృష్ణ మృతిపై దేశవ్యాప్తంగా నివాళ్లు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

కృష్ణ నటించిన సినిమాలను గుర్తు చేసుకుంటూ.. తాము ఆ రోజుల్లో కృష్ణ సినిమాల కోసం ఎలా వెయిట్ చేసేవారమో గుర్తు చేసుకుంటున్నారు. ఇక కృష్ణతో కలిసి పనిచేసిన నటులు, టెక్నీషియన్స్ ఆయన నిరాడంబరతను గుర్తు చేసుకుంటున్నారు.ఇదిలా ఉంటే ఆర్జీవీ ట్వీట్ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. 'కృష్ణ మృతి చెందారని ఎవరూ బాధ పడనవసరం లేదు. ఆయన స్వర్గంలో విజయనిర్మలను కలుసుకొని ఉంటారు. వారిద్దరూ కలిసి పాటలు పాడుకుంటూ నృత్యం చేస్తూ ఉంటారు.' అంటూ వర్మ ట్వీట్ చేశాడు. మోసగాళ్లకు మోసగాడు చిత్రంలోని ఓ పాటను కూడా ఆయన ట్వీట్‌కు జత చేశాడు.


కాగా కృష్ణకు మృతికి సంబంధించి ఆర్జీవీ పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. అంత పెద్ద లెజెండ్ మృతి చెందినప్పుడు కూడా ఈ ఎటకారాలు ఏంటని కొందరు నెటిజన్లు వర్మపై ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. మరి కొందరు నెటిజన్లు మాత్రం వర్మ చేసిన కామెంట్స్ ని నెగటివ్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు.

First Published:  15 Nov 2022 9:06 AM GMT
Next Story