Telugu Global
Cinema & Entertainment

Atlee | చుక్కలు చూపిస్తున్న అట్లీ

Director Atlee - జవాన్ తర్వాత అట్లీకి డిమాండ్ పెరిగింది. దీంతో అతడు తన పారితోషికం పెంచాడు.

Atlee | చుక్కలు చూపిస్తున్న అట్లీ
X

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో కోలీవుడ్ టాప్ డైరక్టర్ అయిపోయాడు అట్లీ. ఆ తర్వాత జవాన్ తో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టాడు. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది జవాన్. దీంతో అట్లీ అంటే ఓ బ్రాండ్ అయిపోయింది.

ఈ సినిమా సక్సెస్ తో ఏరికోరి అట్లీతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు అల్లు అర్జున్. నిజానికి పుష్ప-2 తర్వాత అతడు త్రివిక్రమ్ తో వర్క్ చేయాలి, కానీ అట్లీని ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పటికే వీరి ప్రాజెక్ట్‌కి సంబంధించిన కథాచర్చలు పూర్తయ్యాయి. పుష్ప 2 షూటింగ్ ముగిసిన వెంటనే అల్లు అర్జున్ ఈ సినిమాలో జాయిన్ అవుతాడు.

ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో అట్లీ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఈ చిత్రం కోసం, అట్లీ ఏకంగా 60 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అక్కడితో అయిపోలేదు. సినిమా లాభాల్లో కూడా కొంత వాటాను డిమాండ్ చేసినట్లు సమాచారం. అట్లీకి అన్ని పరిశ్రమలలో మంచి మార్కెట్ ఉంది. అతడిప్పుడు పాన్ ఇండియా దర్శకుడు. అతని ట్రాక్ రికార్డ్ ను దృష్టిలో పెట్టుకొని‌ చూస్తే.. ఈ డిమాండ్ సహేతుకమైనదే.

అల్లు అర్జున్ కూడా ఇప్పుడు 120 కోట్ల రేంజ్‌లో భారీ రెమ్యునరేషన్‌ను కోట్ చేస్తున్నాడు. ఈ లెక్కన చూసుకుంటే, చాలా బడ్జెట్ హీరో-దర్శకుడికే కేటాయించాల్సిన అవసరం ఉంది.

First Published:  13 March 2024 4:25 PM GMT
Next Story