Telugu Global
Cinema & Entertainment

Geethanjali | పార్ట్-3 కూడా ఉందంటున్న దర్శకుడు

Geethanjali - అంజలి నటించిన 50వ చిత్రం 'గీతాంజలి మళ్లీ వచ్చింది'. ఇప్పుడీ సినిమాకు పార్ట్-3 కూడా ఎనౌన్స్ చేశారు.

Geethanjali | పార్ట్-3 కూడా ఉందంటున్న దర్శకుడు
X

అంజలి 50వ సినిమా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. శివ తుర్లపాటి దర్శక‌త్వంలో ఎంవీవీ సినిమాస్‌తో కలిసి కోన ఫిల్మ్స్ కార్పొరేషన్‌పై కోన వెంకట్ నిర్మించారు. హారర్‌ కామెడీ జోనర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన 'గీతాంజలి మళ్లీ వచ్చింది' చిత్రాన్ని ఏప్రిల్ 11న విడుదల చేశారు. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందంటున్నాడు దర్శకుడు శివ తుర్ల‌పాటి.

"రెస్పాన్స్ జెన్యూన్‌గా వస్తోంది. రివ్యూలు కూడా చూశాను. రివ్యూల్లో చెప్పే విష‌యాల‌ను నేనెప్పుడూ పాజిటివ్‌గా తీసుకుంటాను. సినిమాలో చాలా వాటికి ఆన్స‌ర్ చేయ‌కుండా వ‌దిలేశార‌ని కొంద‌రు రాశారు. అయితే, ఆ లాజిక్కుల‌న్నిటికీ స‌మాధానం చెబుతూ పోతే, యానిమ‌ల్ సినిమాలాగా మూడు గంట‌ల నిడివి వ‌స్తుంది. నేను చెప్ప‌ద‌ల‌చుకున్న‌ది అది కాదు. ఇది ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ సినిమా."

కోన వెంకట్ మార్కు రైటింగ్‌ని ఆస్వాదించేవారికి సినిమా చాలా బాగా న‌చ్చుతోందంటున్నాడు శివ. సినిమా చూసిన వారు మెసేజ్‌లు పెడుతున్నారని.. అందరి కోసం గీతాంజలి-3 కూడా తీస్తానని ప్రకటించాడు.

"ఓవర్సీస్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. సునీల్‌, స‌త్య కామెడీ సెకండాఫ్ లో పేలింది. క్లైమాక్స్ ని కొంద‌రు ఎక్స్ ట్రార్డిన‌రీ అని మెచ్చుకుంటున్నారు. కొంద‌రు స‌డ‌న్‌గా పూర్త‌యింది అని అన్నారు. మ‌రికొంద‌రు అదేంట‌ని అన్నారు. ఇలాంటి అనుమానాలు అన్నిటికీ థ‌ర్డ్ పార్ట్ లో స‌మాధానం ఉంటుంది."

కోన వెంకట్ తో గీతాంజలి-3పై ఆల్రెడీ చర్చ జరిగిందంటున్న శివ.. గీతాంజలి-2 సినిమా షూటింగ్ దాదాపు కొలిక్కి వచ్చినప్పుడు పార్ట్-3 ఐడియా వచ్చిందని తెలిపాడు.




First Published:  13 April 2024 5:39 PM GMT
Next Story