Telugu Global
Cinema & Entertainment

Agent Dino Morea - ఏజెంట్ లో 'ది గాడ్'గా డినో మోరియా

Dino Morea Agent Movie - ఏజెంట్ మూవీ నుంచి మరో ఫస్ట్ లుక్ వచ్చింది.

Agent Dino Morea - ఏజెంట్ లో ది గాడ్గా డినో మోరియా
X

అఖిల్ అక్కినేని, డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబోలో వస్తున్న క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ ఏజెంట్. సినిమాలో సాక్షి వైద్య అఖిల్ కు జోడీగా కనిపిస్తుండగా, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు.

తాజాగా ఏజెంట్ నుంచి డినో మోరియాను 'ది గాడ్' గా పరిచయం చేశారు. రాజ్, అక్సర్, జూలీ మొదలైన చిత్రాలలో తన పాత్రలకు పేరుపొందిన బాలీవుడ్ స్టార్ డినో మోరియా..చేతిలో మెషిన్ గన్‌తో పోస్టర్‌లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. అతని పొడవాటి జుట్టు, నెరిసిన గడ్డం, ముఖం మీద గాయాలు ఈ పాత్రను మరింత డేంజరస్ గా ప్రజెంట్ చేస్తున్నాయి.

మొదటి రెండు పాటల్లానే తాజాగా విడుదలైన మూడో పాట రామ-కృష్ణ కూడా చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. హిప్ హాప్ తమిళ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించాడు. రసూల్ ఎల్లోర్ కెమెరా మెన్ గా పని చేస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌. ఏప్రిల్ 28న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా విడుదల కానుంది ఏజెంట్ సినిమా.

First Published:  15 April 2023 8:01 AM GMT
Next Story