Telugu Global
Cinema & Entertainment

Ramabanam - తన క్యారెక్టర్ బయటపెట్టిన హీరోయిన్

Dimple Hayati Ramabanam - రామబాణం సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇందులో తనది ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అంటోంది డింపుల్.

Dimple Hayathi: తెలుగమ్మాయిలు రావాలి
X

Dimple Hayathi: తెలుగమ్మాయిలు రావాలి

గోపీచంద్ హీరోగా నటించిన సినిమా రామబాణం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, ఖుష్బూ కీలక పాత్రలు పోషించారు. డింపుల్ హయతి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఏంటనేది టీజర్ లోనే చూశాం. మరి హీరోయిన్ పాత్ర ఎలా ఉండబోతోంది.

"ఇందులో అర్బన్ అమ్మాయిగా కనిపిస్తా. నా పాత్ర పేరు భైరవి. తను వ్లాగర్. నిజ జీవితంలో అయితే నేను సోషల్ మీడియాకి దూరంగా ఉంటాను. కాబట్టి ఈ పాత్ర నాకు కొత్తగానే అనిపించింది. రీల్స్, వ్లాగ్స్ చేయడంలో ఫన్ జనరేట్ అయ్యింది. ఇందులో చాలా మంది సీనియర్ ఆర్టిస్ట్ లు ఉన్నారు. వారందరితో కలసి వ్లాగ్ చేయాలి, ఇది చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది."

ఇలా రామబాణం సినిమాలో తన పాత్ర తీరుతెన్నుల్ని వెల్లడించింది డింపుల్ హయతి. రామబాణం సినిమా కచ్చితంగా హిట్ అవుతుందంటున్న డింపుల్.. జగపతిబాబు, ఖుష్బూ లాంటి సీనియర్లతో నటించిన అనుభవం తన కెరీర్ కు బాగా పనికొస్తుందని చెబుతోంది.

First Published:  25 April 2023 2:34 PM GMT
Next Story