Telugu Global
Cinema & Entertainment

Dil Raju | ఈసారి ఆ పని చేయడం లేదు

Dil Raju - దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన చిత్రం లవ్ మి. ఆశిష్ హీరోగా నటించిన ఈ సినిమాకు సంబంధించి దిల్ రాజు కీలక నిర్ణయం తీసుకున్నాడు.

Dil Raju | ఈసారి ఆ పని చేయడం లేదు
X

ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమా ‘లవ్ మీ’. హర్షిత, హన్షిత నిర్మిస్తున్న ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. ‘ఇఫ్ యు డేర్’ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా నుంచి టీజర్ రీసెంట్ గా విడుదలై మంచి స్పందన దక్కించుకుంది.

తాజాగా సినిమా నుంచి పాటల ప్రచారం మొదలుపెట్టారు. ముందుగా ‘రావాలి రా’ అనే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో స్వయంగా దిల్ రాజు ఈ పాటను హమ్ చేయగా.. హీరోయిన్ వైష్ణవి చైతన్య ఆలపించింది.

కీరవాణి స్వరకల్పనలో వచ్చిన ఈ పాటను నలుగురు సింగర్స్ తో కలిసి వైష్ణవి చైతన్య సైతం ఆలపించడం విశేషం. ఈ సందర్భంగా కీలకమైన అంశంపై క్లారిటీ ఇచ్చాడు దిల్ రాజు. తమ సినిమాను విడుదలకు ముందు అందరికీ చూపించడం ఆనవాయితీ అని, కానీ ఈ సినిమాను మాత్రం చూపించడం లేదని తెలిపాడు.

"ఆశిష్ కోసం ఈ కథను అనుకోలేదు. నాగ, అరుణ్ కథ చెప్పాక.. ఆశిష్ అయితే ఎలా ఉంటుందో చూడండని చెప్పాను. ఓ వారం తరువాత వాళ్లే వచ్చి ఆశిష్ బాగుంటాడని అన్నారు. పీసీ శ్రీరామ్, కీరవాణి గారికి స్క్రిప్ట్ చెప్పి ఒప్పించారు. చాలా కొత్తగా ఉందని వారు అంగీకరించారు. బడ్జెట్ ఎంతో చెప్పండి.. ఆ బడ్జెట్లోనే తీస్తామని నాగ, అరుణ్ ఎంతో కాన్ఫిడెంట్‌గా చెప్పారు. ఇదో ఘోస్ట్ లవ్ స్టోరీ. సినిమాను ముందే కొంత మందికి చూపించాలని అనుకున్నాం. కానీ ట్విస్టులు రివీల్ అవుతాయని ముందుగా చూపించడం లేదు"

లవ్ మీ సినిమాను ఎలాంటి ప్రీమియర్స్, ప్రివ్యూలు లేకుండా నేరుగా థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై వస్తున్న మూడో చిత్రం ఇది.

First Published:  31 March 2024 7:06 AM GMT
Next Story