Telugu Global
Cinema & Entertainment

Game Changer | రామ్ చరణ్ సినిమాపై దిల్ రాజు డైలమా

Game Changer - గేమ్ ఛేంజర్ సినిమాకు నిర్మాత దిల్ రాజు. కానీ అతడే తన సినిమాపై అయోమయంగా ఉన్నాడు. ఏం చెప్పలేకపోతున్నాడు.

Game Changer | రామ్ చరణ్ సినిమాపై దిల్ రాజు డైలమా
X

ఏడాదిన్నర కిందటి సంగతి.. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ లాంచ్ అయింది. రామ్ చరణ్ హీరో, కియారా అద్వానీ హీరోయిన్, శంకర్ దర్శకుడు. ఈ కాంబినేషన్ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించింది. ఓపెనింగ్ కే చాలామంది హాజరయ్యారు. అలాంటి ప్రాజెక్టు ఇప్పుడు అనిశ్చితిలో పడింది.

అభిమానులు, గేమ్ ఛేంజర్ నుంచి అప్ డేట్ విని చాలా రోజులైంది. ఎట్టకేలకు ఈ సినిమాపై మరోసారి స్పందించాడు దిల్ రాజు. అయితే చెప్పిందే మళ్లీ చెప్పాడు. సినిమా 80శాతం షూటింగ్ పూర్తయిందని, రిలీజ్ డేట్ గురించి శంకర్ ను టైమ్ అడగడం కరెక్ట్ కాదని స్పందించాడు. శంకర్ కు తనకు కావాల్సినంత టైమ్ తీసుకుంటారని, సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాతే రిలీజ్ డేట్ ప్రకటిస్తానని తెలిపాడు.

దీంతో గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ మరోసారి డైలమాలో పడింది. ఆల్రెడీ ఇచ్చిన స్టేట్ మెంట్ నే మళ్లీ ఇచ్చిన దిల్ రాజుపై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. నిజానికి 4-5 నెలల కిందటే దిల్ రాజు ఈ ప్రకటన చేశారు. ఇప్పటికీ మళ్లీ అదే మాట చెబుతున్నారు. అంటే, ఈ 4 నెలల్లో కనీసం 10శాతం షూటింగ్ కూడా పూర్తికాలేదా అని ప్రశ్నిస్తున్నారు అభిమానులు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూర్ లో జరుగుతోంది. చరణ్ పై కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు. అంజలి, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.

First Published:  3 Dec 2023 1:20 PM GMT
Next Story