Telugu Global
Cinema & Entertainment

Dil Raju: "వారసుడు" విషయంలో ఓవర్ హైప్ ఇస్తున్న దిల్ రాజు

Dil Raju: ఒకానొక సమయంలో ప్రముఖ అగ్ర నిర్మాత దిల్ రాజు స్వయంగా సంక్రాంతి వంటి పండగ సమయాల్లో డబ్బింగ్ సినిమాల కంటే తెలుగు సినిమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని చెప్పిన సంగతి తెలిసిందే.

Dil Raju: వారసుడు విషయంలో ఓవర్ హైప్ ఇస్తున్న దిల్ రాజు
X

ఒకానొక సమయంలో ప్రముఖ అగ్ర నిర్మాత దిల్ రాజు స్వయంగా సంక్రాంతి వంటి పండగ సమయాల్లో డబ్బింగ్ సినిమాల కంటే తెలుగు సినిమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా మాత్రం కోలీవుడ్ హీరో తలపతి విజయ్ హీరోగా నటిస్తున్న "వారసుడు" సినిమాని నిర్మించిన దిల్ రాజు ఈ సినిమాపై క్రేజ్ తీసుకురావడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు.

ఒక వైపు బాలకృష్ణ "వీరసింహారెడ్డి" మరో వైపు చిరంజీవి "వాల్తేరు వీరయ్య" సినిమాలు కూడా అదే సమయంలో విడుదలవుతున్నప్పటికీ దిల్ రాజు మాత్రం తాను నిర్మిస్తున్న "వారసుడు" సినిమాకే ఎక్కువ థియేటర్లను తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నైజాం మరియు వైజాగ్ ఏరియాలలో దిల్ రాజు రికార్డు స్థాయిలో థియేటర్లను "వారసుడు" సినిమా కోసం తీసుకున్నారు.

"వాల్తేరు వీరయ్య" మరియు "వీరసింహారెడ్డి" సినిమాలను గురించి పట్టించుకోకుండా దిల్ రాజు ఇలా చేయటం మిగతా డిస్ట్రిబ్యూటర్లు కూడా నచ్చటం లేదు. దిల్ రాజు కావాలని "వారసుడు" సినిమాకి ఓవర్ హైప్ ఇస్తున్నారని తమిళ్లో విజయ్ ఎంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు విజయ్ సినిమా కంటే చిరంజీవి లేదా బాలకృష్ణ సినిమా చూడడానికే ఎక్కువగా ఇష్టపడతారని మిగతా డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు.

మరో వైపు చిరు బాలయ్య కూడా దిల్ రాజు చేస్తున్న పనులు చూస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో "వారసుడు" సినిమా విషయంలో దిల్ రాజు చాలా పెద్ద తప్పు చేస్తున్నారని మరికొందరు చెబుతున్నారు. ఆఖరికి "వారసుడు" సినిమాకి దర్శకత్వం వహించిన వంశీ పైడిపల్లి కూడా ఇది ఒక ప్రాపర్ తమిళ్ సినిమా అని అన్నారు. ఇది కేవలం తెలుగులో డబ్ అవుతున్న ఒక తమిళ్ సినిమా అని దీనికి ఇంత హైప్ అవసరం లేదని ప్రేక్షకులు కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ మూడు సినిమాలలో ఏ సినిమా ప్రేక్షకులను ఆకర్షిస్తుందో వేచి చూడాలి.

First Published:  9 Dec 2022 5:14 PM GMT
Next Story