Telugu Global
Cinema & Entertainment

Sathamanam Bhavathi | అవార్డ్ విన్నింగ్ సినిమాకు సీక్వెల్

Sathamanam Bhavathi Sequel - దిల్ రాజుకు జాతీయ అవార్డ్ తెచ్చిపెట్టిన సినిమా శతమానం భవతి. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ ప్రకటించాడు ఈ నిర్మాత.

Sathamanam Bhavathi | అవార్డ్ విన్నింగ్ సినిమాకు సీక్వెల్
X

స్టార్ హీరోల‌తో భారీ చిత్రాల‌ను నిర్మిస్తూనే, డిఫ‌రెంట్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల‌తో మినిమం బ‌డ్జెట్‌తో ఘ‌న విజ‌యాల‌ను సాధిస్తోన్న నిర్మాత దిల్ రాజు. ఈయ‌న శ్రీవెంట‌కేశ్వ‌ర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై 2017లో రూపొందించిన చిత్రం ‘శతమానంభవతి’. స‌తీష్ వేగేశ్న ఈ సినిమాను తెర‌కెక్కించారు.

‘శతమానంభవతి’ చిత్రంలో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటించగా ప్రకాష్ రాజ్, జయసుధ కీలక పాత్రలు పోషించారు. 2017లో భారీ చిత్రాల న‌డుమ గ‌ట్టిపోటీతో విడుద‌లైన ఈ చిత్రం తిరుగులేని విజ‌యాన్ని సొంతం చేసుకుని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

కుటుంబ క‌థా చిత్రాల‌కు కేరాఫ్‌గా నిలిచిన శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్ బ్యాన‌ర్‌కి ‘శతమానంభవతి’ చిత్రం ప్ర‌త్యేక‌మైన గుర్తింపును తీసుకు రావ‌ట‌మే కాకుండా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన జాతీయ అవార్డును కూడా అందించింది.

ఈ క్ర‌మంలో ‘శతమానంభవతి’కు సీక్వెల్‌గా ‘శతమానంభవతి నెక్ట్స్ పేజీ’ను రూపొందిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు దిల్ రాజు. సంక్రాంతి రోజున ఈ సినిమా ప్రకటన చేసిన దిల్ రాజు, వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు.




First Published:  15 Jan 2024 11:17 AM GMT
Next Story