Telugu Global
Cinema & Entertainment

Men Too Movie - మగాళ్ల కోసం ఓ సినిమా

#MenToo - డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది మెన్ టు సినిమా. పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది.

Men Too Movie - మగాళ్ల కోసం ఓ సినిమా
X

నరేష్ అగ‌స్త్య‌, బ్ర‌హ్మాజీ, హ‌ర్ష చెముడు, సుద‌ర్శ‌న్‌, మౌర్య సిద్ధ‌వ‌రం, రియా సుమ‌న్‌, ప్రియాంక శ‌ర్మ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తోన్న చిత్రం ‘#మెన్ టూ’. లాంధెర్న్ క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై శ్రీకాంత్ జి.రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో మౌర్య సిద్ధ‌వ‌రం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్ చేశారు. మే 5న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది ‘#మెన్ టూ’ సినిమా.

మెన్ టూ సినిమాతో ఎవ‌రినో బాధ పెట్టాల‌నే ఉద్దేశం తమకు లేదని అంటోంది యూనిట్. ఓ విష‌యాన్ని ఓ కోణంలోనే కాకుండా మ‌రో కోణంలో కూడా చూడాల‌ని చెబుతూ ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమాను తీశారట.

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనుల్లో ఉంది. నిజానికి ఈ సినిమాకు చాలా ఓటీటీ ఆఫర్లు వచ్చాయి. కానీ థియేటర్లలో రిలీజ్ చేసిన తర్వాత మాత్రమే ఓటీటీలోకి వెళ్లాలనేది మేకర్స్ ఆలోచన. కంటెంట్ పై వాళ్లు అంత నమ్మకంతో ఉన్నారు మరి.

First Published:  4 March 2023 8:50 AM GMT
Next Story