Telugu Global
Cinema & Entertainment

Dheera Movie | పక్కా మాస్ ట్రయిలర్

Dheera Movie - లక్ష్ చదలవాడ హీరోగా నటించిన సినిమా ధీర. తాజాగా ఈ సినిమా ట్రయిలర్ రిలీజైంది.

Dheera Movie | పక్కా మాస్ ట్రయిలర్
X

వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి సినిమాలతో మాస్ హీరోగా లక్ష్ చదలవాడ అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు మరో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌ ‘ధీర’తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. తన సొంత బ్యానర్ పై లక్ష్ నటించిన ఈ సినిమాకు విక్రాంత్ శ్రీనివాస్ దర్శకుడు.

ధీర గ్లింప్స్, టీజర్‌ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్లు విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లోని విజువల్స్, డైలాగ్స్, హీరోకి ఇచ్చిన ఎలివేషన్స్, లవ్ యాక్షన్ ఇలా అన్ని అంశాలు హైలెట్ అవుతున్నాయి.

‘ఈ మనిషి బ్రెయిన్ ఉంది చూడు అది వెరీ డేంజరస్’.. అనే డైలాగ్స్‌తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ‘రాజ్‌ గురుని మన అటాక్ నుంచి కాపాడాలంటే.. రథం నడిపే కృష్ణుడితో పాటు.. యుద్దం చేసే రాముడు రావాలి.. ఎవడైనా ఉంటాడా?’ అనే డైలాగ్‌తో హీరో ఇంట్రడక్షన్ ఇవ్వడం బాగుంది.

‘నేను కరెన్సీ నోట్ లాంటోడ్ని నాకు కారెక్టర్ లేదు’ అని హీరో చెప్పే డైలాగ్.. ‘ఐ లవ్యూ మనీషా’.. ‘ఐ లవ్యూ అమృతా’.. అంటూ హీరో రొమాంటిక్ యాంగిల్‌ను చూపించారు. రూ. 25 లక్షలతో మొదలైన నా జర్నీ రూ. 2500 కోట్లకు చేరింది..’ అంటూ చివరి డైలాగ్‌తో సినిమా మీద అంచనాలు పెంచేశారు. ఫిబ్రవరి 2న వస్తోంది ధీర.

First Published:  28 Jan 2024 4:15 PM GMT
Next Story