Telugu Global
Cinema & Entertainment

SIR Movie: సార్ రిలీజ్ డేట్ ఫిక్స్

తెలుగు-తమిళ భాషల్లో ధనుష్ చేస్తున్న సినిమా సర్. ఈ సినిమాను ఫిబ్రవరి 17న విడుదల చేయాలని నిర్ణయించారు.

SIR Movie: సార్ రిలీజ్ డేట్ ఫిక్స్
X

నాగవంశీ నిర్మాతగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమా 'సార్'. ధను,్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. సినిమాలో ధనుష్ సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది.

వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రం ('సార్'(తెలుగు) ‌'వాతి',(తమిళం)) షూటింగ్ కొలిక్కి వచ్చింది. ఈ చిత్రాన్ని వచ్చేఏడాది 2023, ఫిబ్రవరి 17న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

దీనికి సంభందించి ఓ ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేశారు. ఇందులో హీరో ధనుష్ కాలేజీ మెట్ల మీద ఎంతో స్టైలిష్ గా కూర్చుని కనిపిస్తున్నాడు. అలాగే ఇటీవల చిత్రం నుంచి విడుదల అయిన 'మాస్టారు మాస్టారు' పాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

విద్యావ్యవస్థ తీరు తెన్నుల మీద సాగే ఈ చిత్రంలో స్పృశించే అంశాలు, సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉండటమే కాకుండా, ఆలోచింపజేసే విధంగా ఉంటాయని చెబుతున్నారు మేకర్స్. తెలుగు, తమిళ భాషల్లో 'సార్' ఫిబ్రవరి 17, 2023న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.




First Published:  18 Nov 2022 6:07 AM GMT
Next Story