Telugu Global
Cinema & Entertainment

'సర్' వచ్చే తేదీ తెలిసిపోయింది

తమిళ హీరో ధనుష్ చేస్తున్న తొలి తెలుగు స్ట్రయిట్ మూవీ సార్. ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు.

సర్ వచ్చే తేదీ తెలిసిపోయింది
X

ధనుష్ హీరోగా నటిస్తున్న స్ట్రయిట్ తెలుగు సినిమా సర్. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న సినిమా ఇది. అతడితో పాటు సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్) సహ-నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి డైరక్టర్.

తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రం (తమిళంలో వాతి టైటిల్) షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 2 న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ఈ రోజు ప్రకటించారు. దీనికి సంబంధించి ఓ ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేశారు.

హీరో ధనుష్ క్లాస్ రూం లో స్టూడెంట్స్ ముందు టేబుల్ మీద కూర్చొని బ్లాక్ బోర్డు మీద గణితం సబ్జెక్ట్ కు చెందిన అంశాలను చూపిస్తూ ఉన్న స్టిల్ ను రిలీజ్ చేశారు. విద్యావ్యవస్థ నేపథ్యంలో హీరో సాగించే ప్రయాణం, అందులోని సమస్యలు, సంఘటనలు 'సార్' జీవితాన్ని ఏ తీరానికి చేర్చాయన్నదే ఈ సినిమా స్టోరీ.

శ్రీకర స్టూడియోస్ నిర్మాణ సంస్థ 'సార్' ను ప్రజెంట్ చేస్తోంది. 'సార్' లో ధనుష్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది.

First Published:  19 Sep 2022 2:00 PM GMT
Next Story