Telugu Global
Cinema & Entertainment

Captain Miller | ధనుష్ మూవీ షూటింగ్ అప్ డేట్స్

Captain Miller - ధనుష్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా కెప్టెన్ మిల్లర్. ఈ సినిమా షూటింగ్ అప్ డేట్స్ చెక్ చేద్దాం..

Captain Miller | ధనుష్ మూవీ షూటింగ్ అప్ డేట్స్
X

నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'కెప్టెన్ మిల్లర్'. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా గుర్తింపు పొందింది. 1930-40ల నేపథ్యంలో వస్తున్న ఈ పీరియాడిక్ ఫిలిం నుంచి ఇప్పటికే టీజర్ రిలీజైంది.

ఈ పీరియడ్ ఫిల్మ్ లో ప్రియాంకా మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఆమె పోర్షన్ కి సంబధించిన షూటింగ్ పూర్తి చేశారు మేకర్స్. ఈ సందర్భంగా విడుదల చేసిన వర్కింగ్ పోస్టర్ లో దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ కు పాయింట్ బ్లాంక్ లో గన్ గురి పెట్టినట్లు పోజిచ్చింది ప్రియాంక.

ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిల్మ్స్ బ్యానర్ పై సెంధిల్ త్యాగరాజన్ ,అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి, సిద్ధార్థ నుని డీవోపీ గా పని చేస్తున్నారు.

బాహుబలి ఫ్రాంచైజీ, RRR, పుష్ప వంటి చిత్రాలకు పనిచేసిన మధన్ కార్కీ ఈ చిత్రం తమిళ వెర్షన్‌కు డైలాగ్స్ రాశారు. ‘కెప్టెన్ మిల్లర్’ డిసెంబర్ 15న తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ సినిమాలో సందీప్ కిషన్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

First Published:  30 Aug 2023 5:31 PM GMT
Next Story