Telugu Global
Cinema & Entertainment

Dhanush | కెప్టెన్ మిల్లర్ కొత్త రిలీజ్ డేట్

Dhanush - ధనుష్ హీరోగా నటించిన కెప్టెన్ మిల్లర్ సినిమా తమిళ్ లో రిలీజైంది. ఇప్పుడు తెలుగు వెర్షన్ రిలీజ్ కు డేట్ సెట్ చేశారు.

Dhanush | కెప్టెన్ మిల్లర్ కొత్త రిలీజ్ డేట్
X

నేషనల్ అవార్డ్ విన్నింగ్ స్టార్ ధనుష్ పాన్ ఇండియా ఫిల్మ్ కెప్టెన్ మిల్లర్. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ మినహా అన్ని భాషలలో తాజాగా విడుదలైంది.

ఈ సినిమా తెలుగు హక్కులను కొనుగోలు చేసిన ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సురేష్ ప్రొడక్షన్స్ జనవరి 25న తెలుగు రాష్ట్రాల్లో కెప్టెన్ మిల్లర్‌ని విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.

అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్ తో ఈ చిత్రం ఇప్పటికే హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. తాజాగా విడుదలైన ట్రైలర్ అంచనాలని మరింతగా పెంచింది. ఏషియన్ మూవీస్, సురేష్ ప్రొడక్షన్స్ కలయికతో కెప్టెన్ మిల్లర్ కు తెలుగు రాష్ట్రాల్లో భారీగా థియేటర్లు దక్కనున్నాయి.

కెప్టెన్ మిల్లర్ ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామా. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. సందీప్ కిషన్, డాక్టర్ శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించారు. బాహుబలి ఫ్రాంచైజీ, ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి చిత్రాలకు పనిచేసిన మధన్ కార్కీ ఈ చిత్రం తమిళ వెర్షన్‌కు డైలాగ్స్ రాశారు.

First Published:  13 Jan 2024 5:17 PM GMT
Next Story