Telugu Global
Cinema & Entertainment

Captain Miller | ధనుష్ మూవీ కెప్టెన్ మిల్లర్ టీజర్ ఎలా ఉందంటే..!

Dhanush's Captain Miller Movie - ధనుష్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ సినిమా కెప్టెన్ మిల్లర్. ఈరోజు ఈ సినిమా టీజర్ రిలీజైంది.

Captain Miller | ధనుష్ మూవీ కెప్టెన్ మిల్లర్ టీజర్ ఎలా ఉందంటే..!
X

నేషనల్ అవార్డ్ విన్నర్, హీరో ధనుష్ హై-బడ్జెట్ పీరియడ్ ఫిల్మ్ 'కెప్టెన్ మిల్లర్'. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా. 2023లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పీరియాడికల్ ఫిల్మ్ 1930-40ల నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిల్మ్స్ బ్యానర్ పై టి.జి. త్యాగరాజన్ నిర్మిస్తున్నారు.

ధనుష్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర నిర్మాతలు టీజర్‌ విడుదల చేశారు. హైదరాబాద్‌లోని ఏఏఏ సినిమాస్‌లో జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్ కి హీరో సందీప్ కిషన్‌తో పాటు 5 వందల మందికి పైగా అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ.. కెప్టెన్ మిల్లర్ సినిమా తనకు చాలా ప్రత్యేకమైన సినిమా అన్నాడు. అంతేకాదు, త్వరలోనే ధనుష్ దర్శకత్వంలో నటించబోతున్న విషయాన్ని కూడా బయటపెట్టాడు.

టీజర్ విషయానికొస్తే, డకాయిట్, హంతకుడుగా ముద్రపడిన కెప్టెన్ మిల్లర్‌ను పట్టుకోవడానికి ప్రకటించిన భారీ రివార్డు నోట్ తో ఆసక్తికరంగా టీజర్ ప్రారంభమవుతుంది. ఇతర ప్రముఖ పాత్రలను పరిచయం చేసిన తర్వాత, పెద్ద యుద్ధంలో ఉన్న కెప్టెన్ మిల్లర్ ఆగ్రహాన్ని చూపించారు. టీజర్ లో యాక్షన్ సన్నివేశాల బాగున్నాయి.

ధనుష్ బ్రిలియంట్ పెర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. అతని స్క్రీన్ ప్రెజెన్స్, మేకోవర్స్ బాగున్నాయి. టీజర్‌లో ప్రియాంక మోహన్, సందీప్ కిషన్, శివ రాజ్‌కుమార్‌ల పాత్రల్ని కూడా చూపించారు. ‘కెప్టెన్ మిల్లర్’ డిసెంబర్ 15న తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

First Published:  28 July 2023 5:26 PM GMT
Next Story