Telugu Global
Cinema & Entertainment

Raayan | ధనుష్ 50వ సినిమా టైటిల్ ఇదే

Raayan Movie - ధనుష్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 50వ చిత్రం రాయన్. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది.

Raayan | ధనుష్ 50వ సినిమా టైటిల్ ఇదే
X

ధనుష్ తన 50వ సినిమా రెడీ చేస్తున్నాడు. హీరోగా నటించడమే కాకుండా, స్వయంగా తనే దర్శకత్వం వహిస్తున్నాడు. సందీప్ కిషన్‌తో పాటు ప్రధాన పాత్రలో నటిస్తున్న ధనుష్‌కి దర్శకుడిగా ఇది రెండో సినిమా. కాళిదాస్ జయరామ్ మరో ప్రధాన పాత్రలో కనిపించనున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ రోజు, మేకర్స్ తమిళం, తెలుగు, హిందీ త్రిభాషా టైటిల్‌ను 'రాయన్‌' గా అనౌన్స్ చేశారు.

ధనుష్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్‌లను అప్రాన్‌లతో ఉన్న రాయన్ ఫస్ట్-లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ధనుష్ ఫుడ్ ట్రక్ ముందు నిలబడి ఉండగా, సందీప్ కిషన్ వాహనం లోపల, కాళిదాస్ దానిపై కూర్చున్నాడు. వారు తమ చేతుల్లో కత్తులతో కనిపించారు. డ్రెస్సులు చూస్తే, వాళ్లు చెఫ్‌లని కనిపిస్తున్నప్పటికీ.. వారి ముఖాల్లోని ఎక్స్ ప్రెసన్, వారి చేతుల్లోని ఆయుధాలు వారు కేవలం చెఫ్‌లు మాత్రమే కాదని చెబుతోంది.

ఈ సినిమాలో ఎస్ జె సూర్య, సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, ఓం ప్రకాష్ డీవోపీ గా చేస్తున్నారు. ఈ సినిమాని ఈ ఏడాదిలోనే విడుదల చేయబోతున్నారు.

First Published:  19 Feb 2024 3:23 PM GMT
Next Story