Telugu Global
Cinema & Entertainment

తమిళనాట తెలుగు డైరెక్టర్ కు మరో సాలిడ్ హిట్

ఇప్పుడు తమిళనాట మరో తెలుగు డైరెక్టర్ హిట్ కొట్టాడు. ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే.

తమిళనాట తెలుగు డైరెక్టర్ కు మరో సాలిడ్ హిట్
X

ఒకప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాలు తెలుగులో ఓ రేంజ్ లో ఆడేవి. రజినీకాంత్, కమల్ హాసన్ ల తర్వాత విక్రమ్, సూర్య, కార్తీ, విశాల్ వంటి హీరోలు నటించిన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ భారీగా విడుదలై మంచి వసూళ్లు సాధించేవి. అలాగే తమిళ డైరెక్టర్లతో సినిమాలు చేసేందుకు తెలుగు హీరోలు ఎగబడేవారు.

అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కోలీవుడ్ లో పేరున్న దర్శకులంతా ఫామ్ లో లేరు. ఈ కారణంగా తమిళ హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కోలీవుడ్ అగ్ర హీరో విజయ్ తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో చేసిన వారసుడు సినిమా ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకు మొదట్లో నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం దుమ్ము రేపింది. విజయ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.

ఇప్పుడు తమిళనాట మరో తెలుగు డైరెక్టర్ హిట్ కొట్టాడు. ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ మూవీని నిర్మించింది. నిన్న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తమిళంలో ఈ సినిమాకు భారీగా ఓపెనింగ్స్ రాగా, తెలుగులోనూ డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమా సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తోంది.

ధనుష్ తర్వాతి సినిమాకు కూడా తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించనున్నాడు. ధనుష్ కోసం శేఖర్ కమ్ముల ఒక పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నారు. గీత గోవిందం వంటి సినిమాతో తెలుగులో గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ పరుశురామ్ కూడా తమిళ అగ్ర హీరో కార్తీతో ఓ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే పరశురామ్ కార్తీని కలిసి కథ వినిపించగా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. కార్తీ హీరోగా నటించే ఖైదీ- 2 సినిమా తర్వాత పరశురామ్ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇలా తమిళ హీరోలు తెలుగు దర్శకుల వెంట పడుతున్నారు.

First Published:  18 Feb 2023 4:30 AM GMT
Next Story