Telugu Global
Cinema & Entertainment

Kubera | ధనుష్ మూవీ టైటిల్ ఇదే

Kubera Movie - ధనుష్, నాగార్జున హీరోలుగా ఓ సినిమా చేస్తున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు.

Kubera | ధనుష్ మూవీ టైటిల్ ఇదే
X

డైరెక్టర్ శేఖర్ కమ్ముల, ధనుష్ తో కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్, కింగ్ నాగార్జున అక్కినేని కలిసి ఈ సినిమా చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మహా శివరాత్రి శుభ సందర్భంగా, మేకర్స్ సినిమా టైటిల్‌ను రివిల్ చేశారు, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అత్యంత సంపన్నుడైన దేవుడు పేరు 'కుబేర' అనే టైటిల్‌ను ఈ చిత్రానికి పెట్టారు. అయితే ధనుష్ లుక్ టైటిల్‌కి భిన్నంగా ఉంది. బ్యాక్ డ్రాప్ లో శివుడు అన్నపూర్ణ దేవి నుంచి భిక్ష తీసుకుంటున్నట్లు ఫొటో పెట్టారు. ఫొటో ముందు చిరిగిన బట్టలతో ధనష్ కనిపిస్తున్నాడు.

టైటిల్‌కు భిన్నంగా ధనుష్ పాత్రను ప్రజెంట్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్‌తో శేఖర్ కమ్ముల ఆసక్తిని రేకెత్తించాడు. దీంతో సినిమాలో ధనుష్ ఎలాంటి పాత్రలో నటిస్తున్నాడనే క్యురియాసిటీ పెరిగింది. నాగార్జున పాత్ర గురించి తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. అయితే ఈ సినిమాలో నాగార్జున పాత్రకు సంబంధించిన అప్‌డేట్ కోసం మరికొంత కాలం ఆగాల్సిందే.

ఈ సినిమాలో రష్మిక హీరోయిన్. నేషనల్ అవార్డ్ విన్నర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా నుంచి నాగ్ లుక్ ను విడుదల చేయబోతున్నారు.



First Published:  9 March 2024 5:27 AM GMT
Next Story