Telugu Global
Cinema & Entertainment

#DNS | ధనుష్-కమ్ముల షూటింగ్ ప్రారంభం

Dhanush, Sekhar Kammula's Movie - ధనుష్-శేఖర్ కమ్ముల కాంబోలో సినిమా లాంఛ్ అయింది. రెగ్యులర్ షూట్ కూడా ప్రారంభమైంది.

#DNS | ధనుష్-కమ్ముల షూటింగ్ ప్రారంభం
X

ధనుష్, నాగార్జున క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వచ్చింది. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావులు నిర్మిస్తున్నారు.

ఈ సినిమా కోసం ఆర్ఆర్ఆర్ తరహాలో.. #DNS అనే హ్యాష్ ట్యాగ్ సృష్టించారు. అంటే.. ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల అని అర్థం. ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఈ సినిమా గ్రాండ్‌గా లాంచ్ అయింది. పూజా కార్యక్రమానికి సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, భరత్ నారంగ్, జాన్వీ నారంగ్ తదితరులు హాజరయ్యారు. ధనుష్‌తో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడంతో రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది.

ధనుష్, నాగార్జునలు సంక్రాంతికి వచ్చిన తమ చిత్రాలు కెప్టెన్ మిల్లర్ (తమిళం) నా సామి రంగతో బ్లాక్‌బస్టర్‌లను అందించడంతో ఈ ఎపిక్ మల్టీ-స్టారర్ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరిగాయి. ఇద్దరు స్టార్స్ ని బిగ్ స్క్రీన్స్ పై కలసి చూడటాని అభిమానులు ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె ఇంకా సెట్స్ పైకి రాలేదు.

ఫిదా, లవ్ స్టోరీ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత కమ్ముల చేస్తున్న సినిమా ఇదే. అంతేకాదు, శేఖర్ కమ్ముల చేస్తున్న తొలి మల్టీస్టారర్ మూవీ కూడా ఇదే.

First Published:  18 Jan 2024 4:42 PM GMT
Next Story