Telugu Global
Cinema & Entertainment

Ramam-Raghavam | సముద్రఖని.. ధనరాజ్.. రామం-రాఘవం

Ramam-Raghavam | నటుడు ధనరాజ్ దర్శకుడిగా మారాడు. దర్శకుడిగా అతడి తొలి సినిమాకు టైటిల్ ఫిక్స్ అయింది.

Ramam-Raghavam | సముద్రఖని.. ధనరాజ్.. రామం-రాఘవం
X

స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై పృథ్వి పొలవరపు నిర్మాణంలో తెరకెక్కుతున్న ద్విభాష చిత్రానికి "రామం రాఘవం" టైటిల్ ను ఖరారు చేశారు. జనవరి 22న అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా రామం రాఘవం ఫస్ట్ లుక్ ను 22 మంది సినీ ప్రముఖుల చేతుల మీదుగా విడుదల చేశారు. నటుడు ధనరాజ్ మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ లో తండ్రి కొడుకులుగా సముద్రఖని , ధనరాజ్ డైనమిక్ గా కనిపిస్తున్నారు. ఇంటెన్స్ తో కూడిన పోస్టర్ కు విశేష స్పందన లభిస్తోంది. ఇదివరకు ఎప్పుడూ చూడని ఒక తండ్రి కొడుకుల కథను అద్భుతంగా తెరమీద ఆవిష్కరిస్తున్నామని అంటున్నాడు దర్శకుడు ధనరాజ్.

ఈ సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య పృద్వి, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు, తదితరులు నటిస్తున్నారు. విమానం చిత్ర దర్శకుడు శివ ప్రసాద్ యానాల రామం రాఘవం సినిమాకు కథ అందించాడు. అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నాడు.

హైదరాబాద్, చెన్నై, అమలాపురం, రాజమండ్రి, రాజోలు, పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'రామం రాఘవం' సినిమాను తమిళ-తెలుగు భాషలలో ఒకేసారి విడుదల చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి టీజర్ రాబోతోంది.

First Published:  23 Jan 2024 4:48 PM GMT
Next Story