Telugu Global
Cinema & Entertainment

Dhamaka: 4 రోజుల్లో బ్రేక్ ఈవెన్

Dhamaka movie: రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. అంతే కాదు, 4 డేస్ లో బ్రేక్ ఈవెన్ కూడా అయింది

Dhamaka Movie Review and Rating in Telugu
X

Dhamaka Movie Review: ‘ధమాకా’ – మూవీ రివ్యూ

రవితేజ సినిమాలంతే. హిట్ అయితే వారం రోజుల్లోపే బ్రేక్ ఈవెన్ అవుతాయి. ఫ్లాప్ అయితే అదే వారం రోజుల్లో దుకాణం సర్దేస్తాయి. తాజాగా రిలీజైన ధమాకా సినిమా హిట్టయింది. 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసింది. ఇవాళ్టి నుంచి ఈ సినిమాకొచ్చే ప్రతి పైసా లాభం కిందే లెక్క.


రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమా ఓ రొటీన్ స్టోరీ. ఈ విషయం అందరికీ తెలుసు. కాకపోతే కొన్ని కామెడీ ట్రాక్స్, మరికొన్ని డైలాగ్స్, పక్కా మాస్ ఎలిమెంట్స్, హిట్ సాంగ్స్, హీరోయిన్ అందాలు.. ఇలా కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజీగా సినిమా వస్తోంది కాబట్టి, అందరూ ధీమాగా ఉన్నారు.


ఆ నమ్మకమే నిజమైంది. ధమాకా హిట్టయింది. వరల్డ్ వైడ్ ఈ సినిమాను 18 కోట్ల 30 లక్షల రూపాయలకు అమ్మారు. నిన్నటితో ఈ సినిమాకు ఆ వసూళ్లు వచ్చేశాయి. దీంతో సినిమా హిట్ అయింది. క్రాక్ తర్వాత రవితేజ సాధించిన క్లీన్ హిట్ ఇది.


తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన ఈ 4 రోజుల్లో ధమాకా సినిమాకు 16 కోట్ల 50 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఈ వీకెండ్ కూడా ఈ సినిమాకు మరో సినిమాతో పోటీ లేదు. 18-పేజెస్ ఫ్లాప్ అవ్వడం ధమాకాకు మరింతగా కలిసొచ్చింది.

First Published:  27 Dec 2022 11:50 AM GMT
Next Story