Telugu Global
Cinema & Entertainment

Dhamaka Movie Collections: మొదటివారం మెరిసిన రవితేజ సినిమా

Dhamaka Movie Box Office Collections: రవితేజ హీరోగా నటించిన సినిమా ధమాకా. ప్రస్తుతం మార్కెట్ లో హిట్టు బొమ్మ ఇదే. వారం రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయింది

Dhamaka Movie Twitter Review: ధమాకా ట్విట్టర్ రివ్యూ
X

Dhamaka Movie Twitter Review: ధమాకా ట్విట్టర్ రివ్యూ

వరుస ఫ్లాపుల తర్వాత ఎట్టకేలకు హిట్ కొట్టాడు రవితేజ. అతడు నటించిన తాజా చిత్రం ధమాకా పెద్ద హిట్టయింది. రొటీన్ కంటెంట్ తో కూడా మెస్మరైజ్ చేసి, ట్రేడ్ ను షాక్ కు గురిచేసింది ఈ సినిమా. అలా సక్సెస్ ఫుల్ గా మొదటి వారం పూర్తి చేసుకున్న ఈ సినిమా, విడుదలైన ఈ 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 62 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది.


తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు భారీ వసూళ్లు వస్తున్నాయి. ఈ వారం రోజుల్లో సినిమాకు 21 కోట్ల 65 లక్షల రూపాయల షేర్ వచ్చింది. 3 రోజుల కిందటే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ వీకెండ్ వసూళ్లతో బయ్యర్లకు మరిన్ని లాభాలు అందించబోతోంది ధమాకా.


ధమాకా సినిమాకు వారం రోజుల్లో వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి

నైజాం - రూ. 10.18 కోట్లు

సీడెడ్ - 3.81 కోట్లు

ఉత్తరాంధ్ర - 2.68 కోట్లు

ఈస్ట్ - 1.12 కోట్లు

వెస్ట్ - 85 లక్షలు

గుంటూరు - 1.25 కోట్లు

నెల్లూరు - 61 లక్షలు

కృష్ణా - రూ. 1.15 కోట్లు

First Published:  30 Dec 2022 7:58 AM GMT
Next Story