Telugu Global
Cinema & Entertainment

Waltair Veerayya:చాలా జాగ్రత్తలు తీసుకున్నానంటున్న దేవిశ్రీ

Waltair Veerayya : వాల్తేర్ వీరయ్య సినిమా కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నానని చెబుతున్నాడు దేవిశ్రీ ప్రసాద్. ఈ రోజు ఈ సినిమా రిలీజ్ అయింది

Waltair Veerayya:చాలా జాగ్రత్తలు తీసుకున్నానంటున్న దేవిశ్రీ
X

ఈరోజు థియేటర్లలోకి వచ్చింది వాల్తేరు వీరయ్య సినిమా. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డానంటున్నాడు మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీ ప్రసాద్. బాస్ పార్టీ నుంచి శ్రీదేవి సాంగ్ వరకు ప్రతి పాట కోసం ప్రత్యేక శ్రద్ద చూపించానని, కొత్తకొత్త వాయిద్యాలు ఉపయోగించానని అన్నాడు.


"పూనకాలు లోడింగ్ పాట చూసే ఉంటారు. బూరలాంటి వాయిద్యంతో ఆ ట్యూన్ ని కంపోజ్ చేయడం జరిగింది. చిరంజీవి గారికి చాలా నచ్చింది. ‘’ఆదరగొట్టావ్ అబ్బాయ్’ అన్నారు. నేను కంపోజ్ చేసిన ట్యూన్ ఒక ఎత్తు అయితే మెగాస్టార్ గారు ఆయన డ్యాన్స్ లతో పాటని మరో స్థాయికి తీసుకెళ్ళిపోయారు. బాస్ పార్టీ యూత్ కి కనెక్ట్ అయ్యేలా చేశాం. బాస్ ని చాలా రోజుల తర్వాత పక్కా మాస్ ఎంటర్ టైనర్ లో చూస్తున్నాం. ఎక్కడా తగ్గకూడదని ప్రతి పాట విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం."


వాల్తేరు వీరయ్యలోని సాంగ్స్ అన్నీ హిట్టయ్యాయి. కొన్ని పాటలు సిల్వర్ స్క్రీన్ పై ఇంకా బాగున్నాయి. సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ, సాంగ్స్ అన్నీ క్లిక్ అయ్యాయి. ఈ విషయంలో దేవిశ్రీని మెచ్చుకోవాల్సిందే.


బాబి దర్శకత్వంలో వచ్చింది వాల్తేరు వీరయ్య సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ ఓ కీలక పాత్ర పోషించాడు.

First Published:  13 Jan 2023 4:03 PM GMT
Next Story