Telugu Global
Cinema & Entertainment

Devil Movie | సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న డెవిల్

Devil Movie - కల్యాణ్ రామ్ అప్ కమింగ్ మూవీ డెవిల్. ఈ సినిమా రన్ టైమ్ ఎంతో తెలుసా..?

Devil Movie | సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న డెవిల్
X

డిఫరెంట్ మూవీస్‌ని చేస్తూ హీరోగా తనదైన ఇమేజ్ సంపాదించుకున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్. సంయుక్తా మీనన్, మాళవికా నాయర్ హీరోయిన్స్. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ద‌ర్శ‌క-నిర్మాత‌గా ఈ సినిమాను రూపొందించారు. డిసెంబ‌ర్ 29న ప్ర‌పంచవ్యాప్తంగా సినిమా భారీ ఎత్తున విడుద‌ల‌వుతుంది.

రీసెంట్‌గా విడుదలైన డెవిల్ మూవీ ట్రైలర్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. పీరియాడిక్ జోనర్‌లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ఆడియెన్స్‌కి ఓ సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వనుంది. లేటెస్ట్‌గా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. 2 గంటల 26 నిమిషాలుగా రన్ టైమ్‌ను ఫిక్స్ చేశారు.

డెవిల్ సినిమాపై పాజిటివ్ టాక్‌ రావటంతో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా సినిమా కోసం వేసిన సెట్స్, సెన్సార్ సభ్యుల్ని ఆకట్టుకున్నాయి. కథ కూడా కొత్తగా ఉందనే టాక్ వచ్చింది.

సినిమాలో కళ్యాణ్ రామ్ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయంటోంది యూనిట్. దీంతో పాటు డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ హైలెట్స్ అని చెబుతున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ గాంధీ నడికుడికర్ ఆధ్వర్యంలో డెవిల్ సినిమా కోసం ఓ ప్రత్యేకమైన లోకాన్ని క్రియేట్ చేశారు. దీనికి సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ తోడు కావటంతో విజువల్స్ నెక్ట్స్ రేంజ్‌లో మెప్పించనున్నాయి.

First Published:  22 Dec 2023 5:15 PM GMT
Next Story