Telugu Global
Cinema & Entertainment

Devara Movie | ఎన్టీఆర్ సినిమాకు అన్నీ మంచి శకునములే

Devara Movie - ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా దేవర. ఇప్పుడీ సినిమా విడుదలకు అన్ని రకాలుగా కాలం కలిసొచ్చింది. అదెలాగో చూద్దాం..

Devara Movie | ఎన్టీఆర్ సినిమాకు అన్నీ మంచి శకునములే
X

ఎన్టీఆర్ దేవర సినిమా కోసం ఏప్రిల్ 5 తేదీని నిర్ణయించినప్పుడు చాలామంది ఆలోచనలో పడ్డారు. తర్వాత అసలు విషయం తెలుసుకున్నారు. అది తిరుగులేని తేదీ. ఆ వారం సెలవులు భారీగా ఉన్నాయి. పైగా పెద్ద హీరోల సినిమాలేం లేవు.

ఏప్రిల్ లో మొదటి 2 వారాల్లో ఉగాది, రంజాన్, శ్రీరామ నవమి రాబోతున్నాయి. అన్ని పండగలు కలిసొచ్చేలా డేట్ లాక్ చేశాడు తారక్. అంతేకాదు, సమ్మర్‌లో మొదటి పెద్ద చిత్రం కూడా దేవర. అలా ఎక్కువరోజులు థియేటర్లలో కొనసాగే ఛాన్స్ ఈ సినిమాకు ఉంది. ఇక ఇతర సినిమాల విషయానికొద్దాం..

పైన చెప్పుకున్న పెద్ద పండగలు అన్నీ ఉన్నా, సమ్మర్ లాంటి పెద్ద సీజన్‌లో సోలో రిలీజ్ డేట్ రావడం చాలా అరుదు. ఈ విషయంలో కూడా దేవర అదృష్టం చేసుకుంది. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా అదే టైమ్ కు వస్తుందని అనుకున్నారు. కానీ రాజకీయాల వల్ల పవన్ కాల్షీట్లు ఇవ్వలేకపోతున్నాడు. కాబట్టి ఓజీ రాదు.

చిరంజీవి, కళ్యాణ్ కృష్ణ సినిమా కూడా సమ్మర్ రిలీజ్ కి ప్లాన్ చేశారు కానీ ఆ సినిమా కాన్సిల్ అయింది. కాబట్టి దేవరతో పోటీగా ఏ పెద్ద స్టార్ సినిమా విడుదలయ్యే అవకాశం లేదు. ఏప్రిల్ నెలలో మరో భారీ చిత్రం విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. 2024 ఏప్రిల్‌లో మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి, బాలకృష్ణ వంటి పెద్ద స్టార్ల సినిమాలేవీ లేవు. ఇంతకంటే మంచి టైమ్ ఎన్టీఆర్ కు దొరకదు.

First Published:  13 Nov 2023 4:06 PM GMT
Next Story