Telugu Global
Cinema & Entertainment

Kiran Abbavaram | 'దేఖో ముంబై' అంటున్న రూల్స్ రంజన్

Rules Ranjan - కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా రూల్స్ రంజన్. ఈ సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ అయింది.

Kiran Abbavaram | దేఖో ముంబై అంటున్న రూల్స్ రంజన్
X

ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం 'రూల్స్ రంజన్'. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే 3 పాటలు రిలీజయ్యాయి. నాలో నేనే లేను, సమ్మోహనుడా, ఎందుకురా బాబు పాటలు రిలీజ్ అవ్వగా.. వీటిలో సమ్మోహనుడా సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి నాలుగో పాటను విడుదల చేశారు మేకర్స్.

'రూల్స్ రంజన్' నుంచి 'దేఖో ముంబై' అంటూ సాగే నాలుగో పాట మార్కెట్లోకి వచ్చింది. హీరో రవితేజ చేతుల మీదుగా ఈ పాట లాంఛ్ అయింది. ముంబై నగరాన్ని పరిచయం చేస్తూ సాగిన ఈ పాట బాగా ఎనర్జిటిక్ గా ఉంది. అమ్రిష్ గణేష్ అందించిన సంగీతం ఫుల్ జోష్ తో ఉంది. ఈ గీతానికి కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు.

"దేఖో ముంబై దోస్తీ మజా.. పీకే కర్ లో మస్తీ మజా.." అంటూ తెలుగు, హిందీ పదాలతో పాటను అల్లిన తీరు బాగుంది. పాట మొత్తానికి హైలెట్ ఏంటంటే.. ఈ సాంగ్ ను అద్నాన్ సమీ ఆలపించడం. లాంగ్ గ్యాప్ తర్వాత అద్నాన్ తెలుగులో ఈ పాట పాడాడు. అద్నాన్ కు మద్దతుగా పాయల్ దేవ్ ఆలపించాడు. సాంగ్ లో ముంబై బీచ్ తో పాటు నగర వీధుల్లో చక్కర్లు కొడుతూ, హీరోహీరోయిన్లు వేసిన స్టెప్పులు అలరించాయి.

పూర్తి స్థాయి వినోద భరితంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 6న థియేటర్లలో విడుదల చేయనున్నారు. వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు. వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న కిరణ్ అబ్బవరం, రూల్స్ రంజన్ పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు.

First Published:  20 Sep 2023 2:57 PM GMT
Next Story