Telugu Global
Cinema & Entertainment

Deepika Padukone | గర్భంతో ఫొటోషూట్

Deepika Padukone - హీరోయిన్ దీపిక పదుకోన్ ప్రస్తుతం బిడ్డను మోస్తోంది. ఆ జ్ఞాపకాల్ని కలకాలం భద్రపరుచుకోవాలనుకుంటోంది.

Deepika Padukone | గర్భంతో ఫొటోషూట్
X

ప్రెగ్నెన్సీని సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఇప్పుడు తాజా ట్రెండ్. సాధారణ కుటుంబాల్లో శ్రీమంతం ఎలా చేసుకుంటారో, సెలబ్రిటీలు దానికి పదింతలు చేసుకుంటారు. ఇందులో ముఖ్యమైంది ప్రెగ్నెన్సీ ఫొటోషూట్. తమ గర్భం పెరుగుతున్నకొద్దీ దాన్ని ఫొటోల్లో బంధించడం తారలకు చాలా ఇష్టం.

అలాఅని ఇదేదో ఫొటోలతోనే అయిపోయే వ్యవహారం కాదు. లక్షలు ఖర్చు అవుతుంది. తాజాగా దీపిక పదుకోన్ కూడా ఇది మొదలుపెట్టింది. తన గర్భంతో ఆమె ఫొటోలు దిగింది. దీని కోసం ఆమె లక్షా 92 వేల రూపాయల ఖరీదైన చీర కట్టింది. 3400 గంటలు కష్టపడి ఈ చీరను తయారుచేశారు.

హైదరాబాద్ లో ఉన్న చౌమహల్లా ప్యాలెస్ డిజైన్ ను స్ఫూర్తిగా తీసుకొని ఈ చీరను డిజైన్ చేశారంట. ఈ చీరకు తగ్గ యాక్ససిరీస్ కోసం అక్షరాలా 3 లక్షల రూపాయలు ఖర్చు చేసింది దీపిక. ఇక మేకప్ కోసం మరో 30వేల రూపాయలు అయ్యాయంట.

ఇలా దీపిక ప్రెగ్నెన్సీ ఫొటోషూట్ చాలా కాస్ట్ లీగా మారింది. ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






First Published:  9 July 2024 3:01 AM GMT
Next Story