Telugu Global
Cinema & Entertainment

తెలుగులోకి దీపిక పదుకోన్ సినిమా

పఠాన్ సినిమా తెలుగు వెర్షన్ తో టాలీవుడ్ లో అడుగుపెడుతోంది దీపికా పదుకోన్. తాజాగా ఫస్ట్ లుక్ కూడా రిలీజైంది.

తెలుగులోకి దీపిక పదుకోన్ సినిమా
X

దీపిక పదుకోన్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ సరసన ఆమె ప్రాజెక్ట్-కె అనే సినిమా చేస్తోంది. ప్రస్తుతం ఇద్దరూ కలిసి రామోజీ ఫిలింసిటీ షెడ్యూల్ లో నటిస్తున్నారు కూడా. అయితే ఈ సినిమా కంటే ముందే దీపిక పదుకోన్ నుంచి మరో సినిమా తెలుగులోకి రాబోతోంది.

షారుఖ్ ఖాన్‌, దీపిక ప‌దుకోన్‌, జాన్ అబ్ర‌హామ్ కాంబోలో ప‌ఠాన్ సినిమా తెరకెక్కుతోంది. య‌ష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు షారూక్ ఖాన్ లుక్ తో గతంలోనే పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు దీపిక పదుకోన్ లుక్ ను కూడా రివీల్ చేశారు.

జులై 25కి ప‌ఠాన్‌ని మొద‌లుపెట్టి ఆరు నెల‌లైంది. ఈ సంద‌ర్భంగా ఈ సినిమాలో అద్భుత‌మైన పాత్ర‌లో న‌టించిన దీపిక ప‌దుకోన్ గ్లింప్స్ విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఇందులో కంప్లీట్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తోంది దీపిక. "ఆమె చేసిన పాత్ర చూస్తే ఎవ‌రికైనా మైండ్ బ్లో అవ్వాల్సిందే. ఈ సినిమాలో ఆమె అయ‌స్కాంతంలా అంద‌రినీ ఆక‌ర్షిస్తుంది." అని అంటోంది యూనిట్.

వచ్చే ఏడాది జన‌వ‌రి 25న బిగ్ స్క్రీన్స్ మీదకు రాబోతోంది ప‌ఠాన్‌.





First Published:  26 July 2022 4:32 AM GMT
Next Story