Telugu Global
Cinema & Entertainment

Deekshit Shetty | దసరా మూవీ బ్యానర్ పై మరో సినిమా

Deekshit Shetty - దసరా సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు దీక్షిత్ శెట్టి. ఇప్పుడీ నటుడు తెలుగులో హీరోగా స్ట్రయిట్ సినిమా చేస్తున్నాడు.

Deekshit Shetty | దసరా మూవీ బ్యానర్ పై మరో సినిమా
X

దసరా సినిమాతో పేరు తెచ్చుకుంది ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్. ఇప్పుడు బ్యానర్ నుంచి మరో మూవీ రాబోతోంది. దసరాలో కీలక పాత్ర పోషించిన దీక్షిత్ శెట్టి ఈ కొత్త సినిమాలో హీరో.

దీక్షిత్ శెట్టి‌, శశి ఓదెల హీరోలుగా ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఎల్.వి.సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమా రాబోతోంది. కె.కె దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శశి ఓదెల ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు.

ఇదొక పీరియాడిక్ సినిమా. 90ల నాటి కథతో ఇది వస్తోంది. క్రైమ్ డ్రామాగా ఇది తెరకెక్కనుంది. దీనికి సంబంధించి విడుదల చేసిన ఓ యానిమేషన్ వీడియోలో సినిమా థీమ్ ను చెప్పకనే చెప్పారు.

పూర్ణచంద్ర తేజస్వి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నగేష్ బన్నెల్ సినిమాటోగ్రాఫర్‌గా, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైంది. తాజాగా మీడియాకు తెలియజేశారు. మిగతా విషయాల్ని దశలవారీగా వెల్లడిస్తారు.

First Published:  20 Jan 2024 5:16 PM GMT
Next Story