Telugu Global
Cinema & Entertainment

Vijay Deverakonda | టైటిల్ కోసం ముహూర్తం ఫిక్స్

Vijay Deverakonda - పరశురామ్ దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. త్వరలోనే ప్రకటిస్తారు.

Vijay Deverakonda | టైటిల్ కోసం ముహూర్తం ఫిక్స్
X

స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జంటగా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథతో దర్శకుడు పరశురామ్ రూపొందిస్తున్నాడు.

ఎస్వీసీ సంస్థలో వస్తున్న 54వ చిత్రమిది. ఈ సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసువర్మ వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా నుంచి మేకర్స్ కొత్త అప్ డేట్ వెల్లడించారు. ఈ నెల 18న సాయంత్రం 6.30 నిమిషాలకు ఈ సినిమా టైటిల్ ను ప్రకటించనున్నారు. ఓ చిన్న టీజర్ ద్వారా ఈ సినిమా టైటిల్ వెల్లడించనున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే సంక్రాంతి పండుగకు గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. గీత గోవిందం వంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రమిది. ఈ కాంబినేషన్ కు దిల్ రాజు తోడవ్వడంతో అంచనాలు పెరిగాయి.

First Published:  15 Oct 2023 11:17 AM GMT
Next Story