Telugu Global
Cinema & Entertainment

Dasara OTT - ఓటీటీలోకి నాని సినిమా, డేట్ లాక్

Dasara movie streaming - నాని హీరోగా నటించిన దసరా సినిమా ఈనెల్లోనే నెట్ ఫ్లిక్స్ లో హంగామా చేయబోతోంది. ఈ మేరకు డేట్ లాక్ అయింది.

Dasara OTT - ఓటీటీలోకి నాని సినిమా, డేట్ లాక్
X

నాని హీరోగా నటించిన తాజా చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడ్ని పరిచయం చేస్తూ, భారీ బడ్జెట్ తో, భారీ అంచనాల మధ్య నాని చేసిన ఈ సినిమా నైజాంలో పెద్ద హిట్టయింది. ఆంధ్రా, సీడెడ్ లో ఆశించిన స్థాయిలో అంచనాల్ని అందుకోలేకపోయింది.

ఈ సంగతి పక్కనపెడితే, నాని పెర్ఫార్మెన్స్ కు అంతా ఫ్లాప్ అయ్యారు. టాలీవుడ్ స్టార్ హీరోల్ని సైతం నాని మెస్మరైజ్ చేశాడు. ప్రభాస్, మహేష్, చిరంజీవి, అల్లు అర్జున్ లాంటి ఎంతోమంది స్టార్లు నాని నటనను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. అటు క్రిటిక్స్ నుంచి కూడా మంచి రేటింగ్స్ వచ్చాయి.

అలా 3 వారాల పాటు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిన దసరా సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. మరో వారం రోజుల్లో, అంటే ఏప్రిల్ 27న ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు పెట్టబోతున్నారు. ఈ మేరకు ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ చేసింది సదరు ఓటీటీ సంస్థ.

సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. సినిమాలోని 'చంకీల అంగీలేసి' అనే పాట పెద్ద హిట్టయింది.

Next Story