Telugu Global
Cinema & Entertainment

దసరా రిలీజ్ డేట్ మారిపోయింది

నాని హీరోగా నటిస్తున్న సినిమా దసరా. ఈ ఏడాదిలోనే థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమాను వాయిదా వేశారు. వచ్చే ఏడాది మంచి డేట్ లాక్ చేశారు.

దసరా రిలీజ్ డేట్ మారిపోయింది
X

హీరో నాని మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ దసరా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ తో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

తాజాగా నిర్మాతలు ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. మార్చి 30, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది దసరా. 30మార్చి, 2023 శ్రీరామ నవమి. ఆ తర్వాత 4 రోజుల లాంగ్ వీకెండ్ ఉంటుంది. అలాగే వేసవి సెలవులు కూడా సినిమాకి కలసిరానున్నాయి. అన్ని భాషల్లో సినిమా విడుదలకు ఇది సరైన సమయం. అందుకే ఈ ఏడాదిలో సినిమాను విడుదల చేయకుండా.. నేరుగా వచ్చే ఏడాది మార్చికి రిలీజ్ డేట్ మార్చేశారు.

అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ లో మాస్‌గా కనిపిస్తున్నాడు నాని. గుబురుగా ఉన్న జుట్టు, గడ్డంతో.. చేతిలో మందు బాటిల్ తో రఫ్ గా కనిపిస్తున్నాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఒకప్పటి పాపులర్ స్టార్ సిల్క్ స్మిత సిగ్నేచర్ ఫోటోని కూడా చూడొచ్చు.

కంఫర్ట్ జోన్ నుండి బయటికి వచ్చి ఈ చిత్రం కోసం ఫుల్ లెంత్ మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించబోతున్నాడు నాని. ఈ పాత్ర కోసం మాస్ లుక్ లోకి మేకోవర్ అయ్యాడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌ లో నిన్నటి నుంచి తిరిగి ప్రారంభమైంది. ప్రధాన తారాగణం అంతా షూటింగ్‌ లో పాల్గొంటున్నారు. నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్. సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడు.





First Published:  26 Aug 2022 2:42 PM GMT
Next Story