Telugu Global
Cinema & Entertainment

Dasara Movie - దసరా మూవీ సెన్సార్ టాక్

Dasara Movie censor talk - దసరా సినిమాకు సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. ఈ సినిమా సెన్సార్ టాక్ చూద్దాం.

Dasara Movie - దసరా మూవీ సెన్సార్ టాక్
X

నాని మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ 'దసరా' మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీని పూర్తి చేసుకుంది. దసరాకు సెన్సార్ బోర్డ్ యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది.

సినిమా రన్ టైమ్ 2:36 గంటలుగా లాక్ చేశారు. ఇలాంటి జానర్‌ సినిమాలకు ఇది పర్ఫెక్ట్ రన్‌టైమ్. టీజర్, ట్రైలర్‌లో చూసినట్లుగా కథకు భారీ స్పాన్ ఉంది. ఇందులో పల్లెటూరి స్నేహితుల మధ్య అందమైన బాండింగ్, రస్టిక్ లవ్ స్టొరీ, మునుపెన్నడూ లేని విధంగా యాక్షన్, అందరినీ కదిలించే భావోద్వేగాలు ఇందులో ఉన్నాయి.

డి-గ్లామరస్‌గా కనిపించే ఛాలెంజింగ్ పాత్రను పోషించాడు నాని. పరిస్థితులకు అనుగుణంగా భిన్నంగా ప్రవర్తించే అనూహ్య పాత్రలో కనిపిస్తాడు. ధరణిగా అతని నటన సినిమాకు హైలెట్ అని చెబుతున్నారు సెన్సార్ సభ్యులు. అలాగే వెన్నెలగా కీర్తి సురేష్ పాత్ర దసరా లో చాలా సర్ప్రైజింగ్ ఉండబోతుందట.

దీక్షిత్ శెట్టి నాని స్నేహితుడిగా కనిపించనున్నారు. సముద్రఖని పాత్ర కూడా కీలకంగా ఉండబోతోంది. నిజానికి సినిమాలోని ప్రతి పాత్రకు తనదైన ప్రాధాన్యత ఉంటుంది.

సినిమా ప్రధాన భాగాన్ని పల్లెటూరి నేపధ్యంలో రూపొందించారు. భారీ ఖర్చుతో 22 ఎకరాల్లో సహజమైన పల్లెటూరి వాతావరణం రిక్రియేట్ చేస్తూ ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా అద్భుతమైన సెట్స్ వేశారు. 30వ తేదీన దసరా అందర్నీ అలరిస్తుందని మేకర్స్ చెబుతున్నారు.

First Published:  18 March 2023 4:44 AM GMT
Next Story