Telugu Global
Cinema & Entertainment

Actor Nani | మళ్లీ 'దసరా'

Nani - దసరా కాంబినేషన్ మళ్లీ కలిసింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని మరో సినిమా చేయబోతున్నాడు.

Actor Nani | మళ్లీ దసరా
X

2023 బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి 'దసరా'. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో నాని పెద్ద హిట్ కొట్టాడు. ఇదే సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇప్పుడీ కాంబినేషన్ మరోసారి కలుస్తోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మాతగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా సినిమా రాబోతోంది. కెరీర్ లో నానికి ఇది 33వ చిత్రం కాగా.. శ్రీకాంత్ కు రెండో సినిమా.

దసరా సినిమాతో రచయితగా, దర్శకుడిగా తన సత్తా చాటాడు శ్రీకాంత్ ఓదెల. ఇప్పుడు నాని కోసమే మరో యాక్షన్ డ్రామా స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఇప్పటివరకు నాని చేయని రోల్ ఇది.

అనౌన్స్ మెంట్ పోస్టర్ ను ఎరుపు రంగులో పెయింట్ చేశారు. అంటే సినిమాలో యాక్షన్-వయొలెన్స్ ఎక్కువగా ఉండబోతోందని అర్థం. నాని గడ్డం, మెలితిప్పిన మీసాలతో కనిపిస్తున్నాడు. నిజానికి నాని ముఖం కనిపించడం లేదు. నాయకుడిగా ఎదగడానికి నీకు గుర్తింపు అవసరం లేదు అనే క్యాప్షన్ కు తగ్గట్టుగానే నాని ముఖాన్ని పెద్దగా చూపించలేదు.

నానిని పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేయడానికి శ్రీకాంత్ మరో మంచి స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవికి విడుదల చేయబోతున్నారు. హీరోయిన్, టెక్నీషియన్స్ వివరాల్ని ఇంకా వెల్లడించలేదు.

ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు నాని. ఈ మూవీ పూర్తయిన వెంటనే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరోసారి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు.




First Published:  31 March 2024 7:14 AM GMT
Next Story