Telugu Global
Cinema & Entertainment

Devara Vs OG | 2 వారాల గ్యాప్ లో 2 పెద్ద సినిమాలు

OG Vs Devara: 2 వారాల గ్యాప్ లో పవన్, ఎన్టీఆర్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రెండు పెద్ద సినిమాల మధ్య ఈ గ్యాప్ సరిపోతుందా?

Devara Vs OG | 2 వారాల గ్యాప్ లో 2 పెద్ద సినిమాలు
X

Devara Vs OG : సంక్రాంతి లాంటి పెద్ద పండగలున్నప్పుడు సినిమాల మధ్య పోటీ కామన్. ఈ ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ బరిలో ఎంత పోటీ నడిచిందో అందరం చూశాం. ఒకేసారి 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు దసరా వంతు వచ్చింది. దసరాకు కూడా ఆల్రెడీ పోటీ మొదలైంది.

దసరా బరిలో ముందుగా రిలీజ్ అవుతున్న సినిమా ఓజీ. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న విడుదల చేయబోతున్నారు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమా రిలీజైన 2 వారాల గ్యాప్ లో దేవర పార్ట్-1 వస్తోంది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అక్టోబర్ 10న విడుదల చేయబోతున్నారు. జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.

దసరాకి ఈ రెండు సినిమాలతోనే బాక్సాఫీస్ ప్యాక్ అయ్యేలా కనిపిస్తోంది. రెండూ పెద్ద సినిమాలు కావడంతో, మరో సినిమాకు చోటు ఉండకపోవచ్చు. అయితే పించ్ హిట్టర్ గా మీడియం రేంజ్ సినిమా ఒకటి రిలీజ్ అయ్యేలా ఉంది. మరికొన్ని రోజుల్లో దసరా సినిమాలపై స్పష్టత వస్తుంది.

First Published:  17 Feb 2024 1:27 PM GMT
Next Story