Telugu Global
Cinema & Entertainment

Danger Pilla | నితిన్ సినిమాలో ఫస్ట్ సింగిల్ సూపర్ హిట్

Danger Pilla - నితిన్ నటిస్తున్న తాజా చిత్రం 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్'. ఈ సినిమా నుంచి తొలి లిరికల్ సాంగ్ రిలీజైంది. సూపర్ హిట్ అయింది కూడా.

Danger Pilla | నితిన్ సినిమాలో ఫస్ట్ సింగిల్ సూపర్ హిట్
X

నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘ఎక్స్‌ట్రా ఆర్టిన‌రీ మేన్‌’. రైట‌ర్-డైరెక్ట‌ర్ వ‌క్కంతం వంశీ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇప్పటికే 60 శాతానికి పైగా చిత్రీకర‌ణ పూర్త‌య్యింది. ఈరోజు ఈ సినిమా నుంచి ‘డేంజర్ పిల్ల..’ అనే లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సాంగ్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెస్మరైజ్ చేసిన హారిస్ జైరాజ్ మ‌రోసారి తన టాలెంట్ చూపించాడు. త‌న‌దైన స్టైల్లో ‘డేంజర్ పిల్ల..’ సాంగ్‌కు ఫుట్ ట్యాపింగ్ బీట్‌ను అందించాడు. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంది ఈ సాంగ్.

ఈ పాట‌ను కృష్ణకాంత్ రాయ‌గా, అర్మాన్ మాలిక్ ఆల‌పించాడు. శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ అందించాడు. సాంగ్ లో నితిన్ డాన్స్ మూమెంట్స్ బాగున్నాయి. శ్రీలీల అందంగా కనిపించింది.

‘ఎక్స్‌ట్రా ఆర్టిన‌రీ మేన్‌’ సినిమా నుంచి విడుదల చేసిన మొదటి పాటే సూపర్ హిట్టయింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరిన్ని పెరిగాయి. మిగతా పాటల కోసం వెయిటింగ్ పెరిగింది.

శ్రేష్ఠ్ మూవీస్‌, ఆదిత్య‌మూవీస్, రుచిర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్స్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈ ఏడాదిలోనే థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

First Published:  2 Aug 2023 5:45 PM GMT
Next Story