Telugu Global
Cinema & Entertainment

Daksha Nagarkar - రావణాసురతో సర్ ప్రైజ్ ఇస్తానంటున్న హీరోయిన్

Daksha Nagarkar - రావణాసుర సినిమాతో షాక్ ఇస్తానంటోంది హీరోయిన్ దక్ష నగార్కర్. ఇంకా తన కెరీర్ విశేషాలు చెబుతోంది.

Daksha Nagarkar - రావణాసురతో సర్ ప్రైజ్ ఇస్తానంటున్న హీరోయిన్
X

దక్ష నగార్కర్.. మెల్లమెల్లగా కెరీర్ ను నిర్మించుకుంటోన్న ఈ హీరోయిన్. హుషారు సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ బ్యూటీ, ఇప్పుడు రవితేజ సరసన రావణాసుర అనే సినిమా చేసింది. ఈ సినిమా ప్రచారంలో పాల్గొన్న దక్ష.. రావణాసుర సినిమా తన కెరీర్ కు మరింత హెల్ప్ అవుతుందని చెబుతోంది.

"నేను ఎప్పుడూ కొత్తగానే చేయాలని ప్రయత్నిస్తుంటాను. హోరాహోరి సినిమాలో మెంటల్ డిస్టర్బ్ గా ఉండే అమ్మాయిగా చేశాను. హుషారు సినిమాలో సరదా పాత్ర, అలాగే జాంబిరెడ్డి సినిమా విషయానికొస్తే, తెలుగులో మొదటి జాంబి ఫిల్మ్. ఇప్పుడు రావణాసుర సినిమా కూడా చాలా డిఫరెంట్ మూవీ. ఇందులో నా పాత్ర చూసి అంతా సర్ ప్రైజ్ అవుతారు."

ఇలా తన కెరీర్ ను మలుచుకుంటున్న విధానంపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది దక్ష. పైన చెప్పుకున్న సినిమాలతో పాటు నాగచైతన్యతో కలిసి బంగార్రాజు సినిమా చేసింది ఈ ముద్దుగుమ్మ.

ఇక రావణాసుర విషయానికొస్తే, ఈ సినిమాలో దక్షతో పాటు మరో నలుగురు హీరోయిన్లు కూడా నటించారు. ఇంతమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ, తనకు ఎలాంటి అభద్రత భావం లేదని, తన పాత్ర చాలా బాగా క్లిక్ అవుతుందని చెబుతోంది దక్ష.

First Published:  21 March 2023 3:02 AM GMT
Next Story