Telugu Global
Cinema & Entertainment

Ahimsa: దగ్గుబాటి అభిరామ్ యాక్షన్ లుక్ ఇదే

Ahimsa Movie: దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా అహింస. ఈ సినిమా నుంచి అభిరామ్ యాక్షన్ లుక్ ను విడుదల చేశారు.

Ahimsa: దగ్గుబాటి అభిరామ్ యాక్షన్ లుక్ ఇదే
X

వెండితెరపై వైవిధ్యమైన ప్రేమకథలని ఆవిష్కరించి ఘన విజయాలని సాధించిన క్రియేటివ్ డైరక్టర్ తేజ. ఇప్పుడీ దర్శకుడు నుంచి వస్తున్న సినిమా అహింస. సురేష్ బాబు కొడుకు, రానా తమ్ముడు అభిరామ్ ఈ సినిమాతో హీరోగా పరిచయమౌతున్నాడు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన 'అహింస' టీజర్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని 'నీతోనే నీతోనే', 'కమ్మగుంటదే' పాటలు సూపర్ హిట్టయ్యాయి. ఇప్పుడీ సినిమా నుంచి అభిరామ్ యాక్షన్ లుక్ ను రిలీజ్ చేశారు.

ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ చిత్రం త్వరలోనే థియేటర్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ చిత్రానికి కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌ గా, అనిల్ డైలాగ్ రైటర్ అందిస్తున్నారు. సుప్రియ ఆర్ట్ డైరెక్టర్.

ఈ సినిమాతో దగ్గుబాటి అభిరామ్ ను కమర్షియల్ హీరోగా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నిస్తోంది దగ్గుబాటి ఫ్యామిలీ. ఉదయ్ కిరణ్, నితిన్, నవదీప్ లాంటి హీరోల్ని పరిచయం చేసిన తేజ అయితే బాగుంటుందని, అభిరామ్ ఫస్ట్ ప్రాజెక్టును తేజకు అప్పగించారు.






First Published:  6 Dec 2022 8:30 AM GMT
Next Story