Telugu Global
Cinema & Entertainment

Custody Movie - ఒక్క పాట కోసం 7 భారీ సెట్స్

Custody Movie - నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా లో ఒక పాట కోసం ఏకంగా 7 సెట్స్ వేశారు

Custody Movie - ఒక్క పాట కోసం 7 భారీ సెట్స్
X

సాధారణంగా ఓ సెట్ వేసి పాట పూర్తిచేయడం కామన్. కానీ ఒక పాట కోసం 7 సెట్స్ వేయడం మాత్రం కాస్త పెద్ద విషయం. కస్టడీ విషయంలో అదే జరుగుతోంది. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఓ పాట కోసం అచ్చంగా 7 భారీ సెట్స్ వేశారు.


అన్నపూర్ణ స్టుడియోస్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సాంగ్ కోసం ఇలా 7 భారీ సెట్స్ రెడీ చేశారు. నాగచైతన్య, కృతి శెట్టిపై తీస్తున్న ఈ పాట, సిల్వర్ స్క్రీన్ పై విజువల్ ఫీస్ట్ గా ఉంటుందంటున్నారు మేకర్స్.


ఈ సినిమాకు సంగీత ద్వయం ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కలిసి మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ కలిసి ఈ సాంగ్ ను కంపోజ్ చేయగా, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు.


తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అరవింద్ స్వామి విలన్ గా కనిపించబోతున్నాడు. ప్రియమణి, శరత్ కుమార్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.


నాగచైతన్య కెరీర్ లోనే కాస్ట్ లీ చిత్రంగా వస్తున్న కస్టడీని, శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నాడు. మే 12న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.

First Published:  22 Feb 2023 2:49 AM GMT
Next Story