Telugu Global
Cinema & Entertainment

Custody Movie: కస్టడీ మూవీ సెన్సార్ టాక్

Custody Movie censor talk: నాగచైతన్య హీరోగా నటించిన కస్టడీ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా సెన్సార్ టాక్ ఎలా ఉందో చూద్దాం.

Custody Movie: కస్టడీ మూవీ సెన్సార్ టాక్
X

నాగచైతన్య నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ కస్టడీ. తొలిసారి తెలుగు-తమిళ భాషల్లో విడుదలవుతోంది నాగచైతన్య సినిమా. దీని కోసం అన్ని ఫార్మాలటీస్ ను ముందుగానే పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలుగులో సెన్సార్ వర్క్ కూడా తొందరగానే పూర్తి చేశారు.

తాజాగా సెన్సార్ అధికారులు ఈ సినిమాను చూసి, U/A సర్టిఫికేట్ ఇచ్చారు. కొన్ని కట్స్ కూడా సూచించారు. చేతి వేళ్లు తెగిపడడం లాంటి కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక సినిమా టాక్ విషయానికొస్తే.. మూవీ సెకండాఫ్ చాలా బాగా వచ్చినట్టు తెలుస్తోంది.

థ్రిల్లర్ సినిమాలకు పెట్టింది పేరు దర్శకుడు వెంకట్ ప్రభు. ఇప్పటికే తమిళ్ లో మంచి హిట్స్ ఇచ్చాడు, అవి తెలుగులో కూడా క్లిక్ అయ్యాయి. ఇప్పుడు తన అనుభవం మొత్తాన్ని వాడి, కస్టడీ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు ఈ దర్శకుడు.

నాగచైతన్య, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కలిసి ఈ సినిమాకు సంగీతం అందించడం మరో స్పెషాలిటీ.

First Published:  9 May 2023 2:58 AM GMT
Next Story