Telugu Global
Cinema & Entertainment

Cult Mama | స్కంద నుంచి అదిరిపోయే పోస్టర్

Cult Mama - స్కంద సినిమా నుంచి మరో సాంగ్ రెడీ అయింది. ఈసారి ఐటెంసాంగ్ ను విడుదల చేయబోతున్నారు.

Cult Mama | స్కంద నుంచి అదిరిపోయే పోస్టర్
X

బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్కంద-ది ఎటాకర్‌. ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ట్రైలర్‌లో రామ్‌ని రెండు డిఫరెంట్ లుక్‌లలో చూపించగా, సెకండ్ లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ట్రైలర్ రామ్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌ లో ప్రజంట్ చేయగా, సెప్టెంబర్ 18న విడుదల కానున్న నాలుగో పాట 'కల్ట్ మామా'లో రామ్ అద్భుతమైన డ్యాన్స్ లు అలరించబోతున్నాయి. ఈ పాటలో ఊర్వశి రౌతేలా కూడా సందడి చేయనున్నారు.

పాట అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో రామ్ మునుపెన్నడూ లేని విధంగా మాస్ అవతార్‌లో కనిపించాడు. ఇందులో ఊర్వశి రౌతేలా మెరిసే దుస్తులలో సూపర్-హాట్‌గా కనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌లు కూడా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. కల్ట్ మామా, అతని కల్ట్ మేనియాను చూడటానికి మనం మరో రెండు రోజులు వేచి ఉండాలి.

తమన్ ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందించాడు. మొదటి 3 పాటలకు మంచి స్పందన వచ్చింది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం రామ్‌ కెరీర్ లోనే ఖరీదైన సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ కీలక పాత్రలో కనిపించనుంది.

సెప్టెంబర్ 28న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం , హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది స్కంద. ఈ సినిమాతో మరోసారి మాస్ ఇమేజ్ పై కన్నేశాడు రామ్ పోతినేని.

First Published:  16 Sep 2023 4:49 PM GMT
Next Story