Telugu Global
Cinema & Entertainment

Skanda | కల్ట్ మామ వచ్చేశాడు

Skanda - స్కంద మూవీ నుంచి స్పెషల్ సాంగ్ వచ్చేసింది. రామ్ తో పాటు ఊర్వశి రౌతేలా స్టెప్పులేసింది.

Skanda | కల్ట్ మామ వచ్చేశాడు
X

బోయపాటి శ్రీను, రామ్ పోతినేని క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘స్కంద’. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ హిట్టయింది. గ్లింప్స్, టీజర్, ట్రైలర్.. ఇలా అన్నీ క్లిక్ అయ్యాయి. ఈ రోజు, గణేష్ చతుర్థి సందర్భంగా, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కల్ట్ మామా పాటను విడుదల చేశారు.

కల్ట్ మామా సాంగ్ అనేది స్కందలో స్పెషల్ సాంగ్. ఈ పాటలో రామ్ తో ఊర్వశి రౌతేలా డాన్స్ చేసింది. రామ్ ఎనర్జీకి తగ్గట్టు, హెవీగా ఉంది ఈ సాంగ్. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ పాటను రమ్య బెహెరా, మహాతో కలిసి హేమ చంద్ర పాడారు.

పాటలో రామ్ పోతినేని మాస్ గెటప్ తో ఎనర్జిటిక్ గా కనిపించాడు. అతని లుక్ తో పాటు డాన్స్ చూడ్డానికి బాగుంది. ఇక ఊర్వశి రౌతేలా తన గ్లామర్ తో పాటకు మరింత కిక్ తీసుకొచ్చింది.

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం రామ్‌ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా.. సాయి మంజ్రేకర్ సెకెండ్ హీరోయిన్ గా కనిపించనుంది. శ్రీకాంత్, గౌతమి, ప్రిన్స్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 28న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది స్కంద మూవీ.

First Published:  18 Sep 2023 4:36 PM GMT
Next Story