Telugu Global
Cinema & Entertainment

Jagame Maya: నేరుగా ఓటీటీలోకి మరో సినిమా

Jagame Maya: ధన్య బాలకృష్ణన్ నటించిన క్రైమ్ డ్రామా జగమే మాయ. ఇప్పుడీ సినిమా నేరుగా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది.

Jagame Maya: నేరుగా ఓటీటీలోకి మరో సినిమా
X

ఓ వైపు థియేటర్లలో వారానికి పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ తాకిడిని తట్టుకోలేని మరికొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇయర్ ఎండ్ కావడంతో చిన్న సినిమాలన్నీ క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆ మూవీ డీటెయిల్స్..

ధన్య బాలకృష్ణన్, తేజ ఐనంపూడి, చైతన్య రావ్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా జగమే మాయ. ఇన్ స్టంట్ కర్మ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని జ్యాపీ స్టూడియోస్ పతాకంపై ఉదయ్ కిరణ్ కోలా, విజయ్ శేఖర్ అన్నే నిర్మించారు. క్రైమ్ డ్రామా కథతో దర్శకుడు సునీల్ పుప్పాల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఈ నెల 15వ తేదీ నుంచి డిస్నీ హాట్ స్టార్ లో జగమేమాయ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని తాజాగా ప్రకటించారు మేకర్స్.

ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఐడియా మీద వెళ్లే క్రైమ్ డ్రామా సినిమా ఇది. మనలో ఎవరూ బ్లాక్ అండ్ వైట్ లాంటి వ్యక్తిత్వం కలిగి

ఉండరు. అందరిలోనూ గ్రే షేడ్స్ ఉంటాయని చెప్పే కథ ఇది. జీవితంలో మనం ఒకరికి చెడు చేయాలని చూస్తే..ఆ బ్యాడ్ మనకే జరుగుతుంది అని చెప్పే చిత్రమిది.

First Published:  15 Dec 2022 4:11 AM GMT
Next Story