Telugu Global
Cinema & Entertainment

పుష్ప క్రేజీ అప్ డేట్ వచ్చేసింది

అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా పుష్ప. ఈ సినిమా సీక్వెల్ పై ఎలాంటి స్పష్టత లేదు. ఎట్టకేలకు పుష్ప పార్ట్-2పై క్లారిటీ వచ్చింది.

పుష్ప క్రేజీ అప్ డేట్ వచ్చేసింది
X

పుష్ప పార్ట్-1 వరల్డ్ వైడ్ హిట్టవ్వడంతో, ఇప్పుడు పార్ట్-2పై అందరి దృష్టి పడింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఆడియన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో ఈ సినిమా అంత డిలే అవుతూ వస్తోంది. ఎట్టకేలకు పుష్ప పార్ట్-2 షూటింగ్ అప్ డేట్ వచ్చేసింది.

ఈ నెలలోనే, కుదిరితే మరో 10 రోజుల్లో పుష్ప-2 రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లోనే ఉంటుంది. ఈ మేరకు అన్నపూర్ణ స్టుడియోస్ లో ఏర్పాట్లు సాగుతున్నాయి.

మొన్నటివరకు బన్నీ బిజీగా ఉండడంతో ఈ సినిమా షూటింగ్ లేట్ అయింది. ఆ తర్వాత రష్మిక కాల్షీట్లతో సమస్యతో వచ్చింది. తాజాగా సుకుమార్ ఫ్యామిలీ టూర్ పెట్టుకున్నాడు. కుటుంబంతో దుబాయ్ వెళ్లిన సుక్కూ, 5వ తేదీన తిరిగి హైదరాబాద్ వస్తున్నాడు. ఆ వెంటనే పుష్ప-2 రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది.

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా ఏ స్థాయిలో హిట్టయిందో అందరికీ తెలిసిందే. నార్త్ లో అయితే అల్లు అర్జున్ ను ఈ సినిమా స్టార్ ను చేసింది. ఏకంగా వంద కోట్లు కలెక్ట్ చేసింది. సామాన్య జనం నుంచి క్రికెటర్ల వరకు అంతా ఈ సినిమాలో మేనరిజమ్స్ ను అనుకరించడం స్టార్ట్ చేశారు. స్వయంగా రాజ్ కుమార్ హిరాణి లాంటి దర్శకుడు పుష్ప సినిమాను ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. అందుకే పుష్ప-2పై అంచనాలు ఆకాశాన్నంటాయి.

First Published:  2 Sep 2022 3:49 AM GMT
Next Story