Telugu Global
Cinema & Entertainment

Like Share & Subscribe: సినిమాలో కామెడీ గ్యారెంటీ అంట

లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ సినిమాలో కామెడీ గ్యారెంటీ అంటున్నాడు దర్శకుడు మేర్లపాక గాంధీ. సినిమా ఆసాంతం కామెడీ ఉంటుందని చెబుతున్నాడు

Like Share & Subscribe: సినిమాలో కామెడీ గ్యారెంటీ అంట
X

లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ .. రేపు రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో కామెడీ ఉంటుందనే అభిప్రాయంలో ఉన్నారు ప్రేక్షకులు. ఆ అంచనాల్ని ఏమాత్రం అందుకోలేకపోయినా సినిమా ఫ్లాప్ అవుతుంది. ఇదే విషయంపై యూనిట్ స్పందించింది. మరీ ముఖ్యంగా దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ అంశంపై స్పందించాడు.

తమ సినిమాలో కచ్చితంగా కామెడీ ఉంటుందని అంటున్నాడు గాంధీ. అయితే ఆ కామెడీ ఏదో ఇరికించినట్టు కాకుండా, సిచ్యుయేషనల్ కామెడీగా ఉంటుందని చెబుతున్నాడు. సినిమా మొత్తం కామెడీ ఉంటూనే, అంతర్లీనంగా థ్రిల్ ఎలిమెంట్స్ ఉంటాయని చెబుతున్నాడు.

"లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ కథ చాలా హిలేరియస్ గా ఉంటుంది. హీరో, హీరోయిన్ ఇద్దరూ ట్రావెల్ వ్లాగర్స్. వీరి మధ్య ఫైట్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ట్రావెల్ వీడియోలు షూట్ చేసే క్రమంలో ఎలాంటి ప్రమాదం ఎదుర్కొన్నారనేది కూడా చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటుది. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ ఫస్ట్ ఫ్రేమ్ నుండి చివరి ఫ్రేమ్ వరకూ ఒక లాఫ్ రైడ్ లా ఉంటుంది. అండర్ కరెంట్ గా ఒక సమస్య రన్ అవుతూనే .. ఆ పరిస్థితి నుండి పుట్టే సిట్యువేషనల్ కామెడీ అద్భుతంగా ఉంటుంది."

ఇలా తమ సినిమాలో కచ్చితంగా కామెడీ ఉంటుందని చెబుతున్నాడు దర్శకుడు. సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మించారు.

First Published:  3 Nov 2022 3:46 AM GMT
Next Story