Telugu Global
Cinema & Entertainment

Tollywood Christmas | క్రిస్మస్ పోటీ మొదలు

Tollywood Christmas - టాలీవుడ్ లో అప్పుడే క్రిస్మస్ పోటీ మొదలైంది. 2 క్రేజీ సినిమాలు పోటీ పడబోతున్నాయి.

Tollywood Christmas | క్రిస్మస్ పోటీ మొదలు
X

గతేడాది క్రిస్మస్ కు ఎంత హడావుడి నడిచిందో అందరం చూశాం. అందుకే ఈసారి క్రిస్మస్ కోసం ఇప్పట్నుంచే కర్చీఫులు రెడీ చేసుకుంటున్నారు టాలీవుడ్ జనం. ఇందులో భాగంగా ప్రస్తుతానికి రెండు సినిమాలు క్రిస్మస్ రిలీజ్ అంటూ ప్రకటనలు చేసుకున్నాయి.

వీటిలో ఒకటి రాబిన్ హుడ్. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

సరిగ్గా ఈ ప్రకటనకు కాస్త అటుఇటుగా తండేల్ మూవీ ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. నాగచైతన్య హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఇది. సాయిపల్లవి హీరోయిన్. చందు మొండేటి దర్శకుడు. అల్లు అరవింద్ ప్రజెంటర్. ఇలా భారీ సెటప్ తో వస్తున్న ఈ సినిమాను కూడా డిసెంబర్ 20న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

సో.. ప్రస్తుతానికైతే క్రిస్మస్ కు ఈ 2 సినిమాల మధ్యనే పోటీ ఉండబోతోంది. మధ్యలో డబుల్ ఇస్మార్ట్ లాంటి ఒకట్రెండు సినిమాల పేర్లు వినిపిస్తున్నప్పటికీ, ప్రధానంగా పోటీ మాత్రం నితిన్-నాగచైతన్య మధ్యనే ఉండబోతోంది. మొత్తానికి ఈ ఏడాది క్రిస్మస్ కూడా రసవత్తరంగా మారబోతోందన్నమాట.

First Published:  19 April 2024 5:23 PM GMT
Next Story