Telugu Global
Cinema & Entertainment

శ్రీదేవికి డేట్ ఫిక్స్ చేసిన వీరయ్య

Waltair Veerayya: చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా నుంచి సెకెండ్ సింగిల్ రాబోతోంది. ఈ పాటను సోమవారం విడుదల చేయబోతున్నారు.

శ్రీదేవికి డేట్ ఫిక్స్ చేసిన వీరయ్య
X

చిరంజీవి, బాబీ కాంబోలో వస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'వాల్తేరు వీరయ్య'. ఇటీవల విడుదలైన రవితేజ టీజర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. బాస్ పార్టీ సాంగ్ 25 మిలియన్ల వ్యూస్ ని క్రాస్ చేసి సూపర్ హిట్టయింది.

ఇప్పుడు సెకండ్ సింగిల్ 'నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి' ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ నెల 19న సెకండ్ సింగిల్ ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ చిరంజీవి, శృతి హాసన్‌ల కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

సినిమాకు సంబంధించి శృతి హాసన్‌, చిరంజీవిని జోడిగా చూడటం ఇదే మొదటిసారి. శ్రుతి హాసన్ అందంగా ఉంది. బాస్, శృతి హాసన్ కెమిస్ట్రీ కూడా బాగుంది.

ఈ పాట కోసం దేవి శ్రీ ప్రసాద్ మరో మ్యూజికల్ ట్రీట్ ని స్కోర్ చేశాడు. చిరంజీవి లీక్ చేసిన వీడియో ద్వారా ఇప్పటికే చిన్న గ్లింప్స్ అందరినీ సర్ ప్రైజ్ చేసింది. ఈ పాటలో చిరంజీవి, శ్రీదేవిల ఐకానిక్ పెయిర్ ప్రస్తావన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

పోస్టర్‌లో మంచుతో కప్పబడిన లొకేషన్ సూపర్ గా ఉంది. సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. చివరి పాటను ప్రస్తుతం చిరంజీవి, శృతి హాసన్‌లపై యూరప్‌లో చిత్రీకరిస్తున్నారు. 'వాల్తేరు వీరయ్య' జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.




First Published:  17 Dec 2022 12:19 PM GMT
Next Story